Nikhil Siddhartha Baby : టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ తాజాగా తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తన భార్య పల్లవి బుధవారం ఓ పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చారు. తాజాగా నిఖిల్ ఆ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆ చిన్నారిని దీవిస్తూ ఈ జంటకు కంగ్రాజ్యులేషన్ చెప్తున్నారు.
-
Our Unique Star ⭐️@actor_Nikhil and his wife #Pallavi Garu now blessed with a BABY BOY❤️
— Aravind Gandikota (@Aravind0019) February 21, 2024
Warmest congratulations to the glowing couple on this delightful addition to their family 🤗✨#NikPal pic.twitter.com/XI7GZUf7lL
ఇటీవలే తన సతీమణికి సీమంతం జరిగినట్లు నిఖిల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. "నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకనున్నాం. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు అందించండి.' అంటూ నిఖిల్ పోస్ట్ చేశారు. ఇక అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో నిఖిల్ పల్లవి స్నేహితులు ఈ జంటను ఆటపట్టించారు. పుట్టబోయే బేబీకి ఎలా డైపర్ వెయ్యాలంటూ నిఖిల్‌కు ట్రైనింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. 2020లో నిఖిల్ - పల్లవి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లాక్డౌన్ కారణంగా అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే - 'హ్యాపీడేస్' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో, తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన పలు తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. 'కార్తికేయ-1', 'స్వామి రారా', 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు.
Nikhil Upcoming Movies List : ఇక ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభూ' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్ ఓ వారియర్ రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు. ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. నిఖిల్‌కు 'స్వయంభూ' 20వ సినిమా కాగా, ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాతో పాటు నిఖిల్ 'కార్తికేయ-3','ది ఇండియా హౌస్' అనే రెండు పాన్ ఇండియా సినిమాల్లోనూ నటిస్తున్నారు.
'స్వయంభూ' కోసం నిఖిల్ ప్రాక్టీస్ - కత్తిసాము సూపర్‌గా చేస్తున్నారుగా!
Nikhil Spy Movie : 'ఆ కారణంతోనే 'స్పై' మూవీ ఫ్లాప్'.. హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్