Netflix OTT Trending Movies : ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలో సరికొత్త కంటెంట్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఆడియెన్స్ అభిరుచికి తగినట్లుగా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో వస్తుంటాయి. అలా ఈ వారం కూడా పలు ఓటీటీ సంస్థలలో చాలానే సినిమా సిరీస్‌లు వచ్చాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అదిరిపోయే చిత్రాలు ఉన్నాయి. అలా వచ్చిన వాటిలో ఈ వారం అస్సలు మిస్ కానీ టాప్ 6 బెస్ట్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.
క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మర్డర్ ముబారక్ సినిమా. సారా అలీ ఖాన్, పంకజ్ త్రిపాఠి, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, సంజయ్ కపూర్, డింపుల్ కపాడియా వంటి స్టార్స్ ఇందులో నటించారు. హోమి అదజానియా డెరెక్ట్ చేశారు. ఓ హోటల్‌లో జరిగిన హత్య నేపథ్యంలో నడుస్తుందీ చిత్రం. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది టాప్ 1 ట్రెండింగ్‌లో ఉంది.
ఫాంటసీ అడ్వెంచర్ అండ్ సర్వైవల్ థ్రిలర్ డామ్‌సెల్. పెళ్లి తర్వాత ఓ యువరాణి తన అత్తారింటిలో చిత్ర హింసలకు గురౌతుంది. ఆమెను డ్రాగెన్ ఉన్న గుహలో పడేస్తారు. ఆ డ్రాగెన్ బారి నుంచి ప్రాణాలతో ఆ ప్రిన్సెస్ ఎలా బయపడిందనేదే ఈ సినిమా కథ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ అన్వేషిప్పిన్ కండేతుమ్. నెట్‌ఫ్లిక్స్‌లో మూడో స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో ఒక కేసును ఛేదించడమే చూపిస్తుంటారు. కానీ ఇందులో రెండు హత్య కేసులను ఛేదించే సీన్స్‌ను గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా చూపించారు. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు.
విజయ్ సేతుపతి, కత్రీనా కైఫ్ తొలిసారి కలిసి నటించిన మర్డర్ మిస్టరీ మూవీనే క్రిస్మస్. క్రిస్మస్ పండగ రోజే జరిగిన ఓ హత్య కేసును ఛేదించే నేపథ్యంలో కథ సాగుతుంది. థియేటర్లలో అంతగా ఆడలేదు కానీ ఓటీటీలో మంచిగానే రెస్పాన్స్‌ను అందుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం చేశారు. ఇది టాప్ 4లో ట్రెండింగ్ అవుతోంది.
ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళీ హిట్ చిత్రం తుండు. రణం, ఖతర్నాక్ చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన బిజూ మీనన్, దసరా విలన్ షైన్ టామ్ చాకో నటించిన చిత్రమిది. రియాజ్ షరీఫ్ తెరకెక్కించిన ఈ మూవీ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇంకా బ్లాక్ అడమ్, డంకీ, యానిమల్, ఆర్ట్ ఆఫ్ లవ్, ఐరిష్ విష్ సినిమాలు కూడా తర్వాతి స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఓటీటీలోకి వచ్చేసిన 'హనుమాన్' - అక్కడ ఫ్రీగా చూసేయొచ్చు!
పునీత్ రాజ్ కుమార్ జయంతి - టాలీవుడ్ స్టార్స్ చిరు టు ఎన్టీఆర్‌తో స్వీట్ మెమరీస్!