ETV Bharat / entertainment

'అన్​స్టాపబుల్ సీజన్ 4 అనౌన్స్​మెంట్' - ఈ సూపర్ హీరో దెబ్బకు థింకింగ్ మారితీరాలా!

సూపర్ హీరోగా బాలయ్య - డిఫరెంట్ కాన్సెప్ట్​తో అన్​స్టాపబుల్ సీజన్ 4 అనౌన్స్​మెంట్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

NBK Unstoppable Season 4
Balakrishna (ETV Bharat)

NBK Unstoppable Season 4 : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్​గా సక్సెస్​ఫుల్​గా నడుస్తున్న'అన్​స్టాపబుల్​' షో. మరో కొత్త సీజన్​తో అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ సూపర్ ట్రైలర్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా విడుదల చేసింది.

యానిమేషనల్ బొమ్మలతో, సూపర్ హీరో కాన్సెప్ట్​తో ఆ వీడియో అటు పెద్దలతో పాటు ఇటు చిన్నారులను అలరిస్తోంది. అయితే అక్టోబరు 24వ నుంచి ఈ సీజన్​ స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సారి ఎంటర్​టైన్మెంట్​ మామూలుగా ఉండదు!
మరోవైపు అన్​స్టాపబుల్ నిర్వాహకులు ఈ సీజన్​ను గ్రాండ్​గా ప్లాన్ చేశారట. గత సీజన్ల కంటే ఈసారి భిన్నంగా ఉంటుందని తెలిసింది. ఇక ప్రతీ సీజన్​లాగే ఈసారి కూడా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు గెస్ట్​లుగా రానున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ సీజన్​కు తొలి గెస్ట్​గా రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్​కు సంబంధించి షూట్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ సీజన్​లో దుల్కర్​తో పాటు మరికొంత మంది బడా స్టార్ల బాలయ్య 'అన్​స్టాపబుల్' షో లో సందడి చేయనున్నట్లు సమాచారం. కాగా, అన్​స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. గతంలో ఈ ప్రోగ్రామ్​కు టాలీవుడ్, బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల నుంచి బడా స్టార్లు గెస్ట్​లుగా వచ్చి సందడి చేశారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, రవితేజ, విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్ద జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం 'ఎన్​బీకే 109' షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ విలన్​గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్​పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై టీమ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం విజయ్‌ కార్తీక్‌ చూసుకుంటున్నారు.

'BB4' దసరా​ బ్లాక్​ బస్టర్​ అప్డేట్​ - షూటింగ్ ఆ రోజు నుంచే ప్రారంభం

బాలయ్య, మహేశ్ మల్టీస్టారర్- క్లూ ఇచ్చిన తమన్- స్టోరీ కూడా కంప్లీట్! - Balayya Mahesh Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.