ETV Bharat / entertainment

బిగ్​బాస్​ కంటెస్టెంట్​తో నయన్​ లవ్​స్టోరీ - డిఫరెంట్​గా మూవీ అప్డేట్​ అనౌన్స్​మెంట్​! - Nayanthara Kavin Movie - NAYANTHARA KAVIN MOVIE

Nayanthara Kavin Movie : లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా తన అప్​కమింగ్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఫొటోను షేర్ చేసింది. అందులో ఓ యంగ్ హీరో కూడా కనిపించి సందడి చేశారు. ఆ విశేషాలు మీ కోసం.

Nayanthara Kavin Movie
Nayanthara (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 7:30 AM IST

Updated : Jul 23, 2024, 9:04 AM IST

Nayanthara Kavin Movie : కోలీవుడ్ స్టార్ హీరోయిన్​, లేడీ సూపర్​స్టార్ నయన​తారా తాజాగా తన్ అప్​కమింగ్​ మూవీ గురించి డిఫరెంట్​గా అనౌన్స్​ చేసింది. ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఓ వింటేజ్ ఫొటోను షేర్​ చేసి హాయ్ అంటూ రాసుకొచ్చింది. అందులో యంగ్ హీరో కవిన్ కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో ఈ కాంబోలో సినిమా రానున్నట్లు అఫీషియల్​గా కన్ఫార్మ్​ అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఇంకేం అనౌన్స్​మెంట్స్ చేయలేదు.

అయితే పోస్టర్ చూస్తుంటే మాత్రం ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. దీంతో అభిమానుల్లో మరింత ఎగ్జైట్​మెంట్​ పెరిగిపోయింది. 'లియో' లాంటి సూపర్ హిట్​ సినిమాలను నిర్మించిన సెవెన్ స్క్రీన్​ స్టూడియో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. విష్ణు ఇడవన్‌ ఈ సినిమాతో డైరెక్టర్​గా డెబ్యూ చేయనున్నారు.

మరోవైపు ఈ సినిమాలోని నయన్‌ పాత్ర గురించి సోషల్ మీడియాలో పలు రూమర్స్ ట్రెండ్ అవుతున్నాయి. కథ పరంగా నయన్‌ ఈ మూవీలో హీరోకంటే పెద్ద వయసు అమ్మాయిగా కనిపించనుందట. అంతేకాకుండా తనకంటే చిన్నవాడైన హీరోను లవ్‌ చేస్తుందట. కాన్సెప్ట్​ కాస్త ఇంట్రెస్టింగ్​గా ఉండటం వల్ల నయన్‌ ఈ మూవీకి ఓకె చెప్పినట్లు సమాచారం.

ఇక నయన్​ చివరిగా 'అన్నపురణి' అనే లేడీ ఓరియెంటడ్​ చిత్రంలో కనిపించింది. 'నయ‌న్ 75'గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. పైగా కంటెంట్​ పరంగానూ పలు విమర్శలను కూడా ఎదుర్కొంది. దీంతో ఈ సినిమాను బ్యాన్​ చేయాలంటూ పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కూడా.

ఇదిలా ఉండగా, నయన్​ ప్రస్తుతం యశ్​ లీడ్​ రోల్​లో రూపొందుతున్న 'టాక్సిక్' సినిమాలో నటిస్తోంది.దీంతో పాటు మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీతో ఓ సినిమాకు సైన్​ చేసినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్​ డ్రామాగా తెరెకెక్కుతున్న 'టెస్ట్'లోనూ నయన్ కీలక పాత్ర పోషించింది. వీటితో పాటు 'మనగట్టి సిన్స్ 1960' అనే సినిమాలోనూ ఈమె నటిస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ షూటింగ్​ దశలో అలాగే పోస్ట్​ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

ఒకే ఫ్రేమ్‌లో మూడు ఇండస్ట్రీలు! ఇంట్రెస్టింగ్ ఫొటో షేర్ చేసిన నయన్ భర్త - Vignesh Shivan Anant Radhika

'ఆ సినిమాలో నన్ను చెత్తగా చూపించారు - అందుకే ఇప్పటికీ బాధపడుతుంటాను' - NAYANTHARA Movies

Last Updated : Jul 23, 2024, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.