ETV Bharat / entertainment

'ఆ సినిమాలో నన్ను చెత్తగా చూపించారు - అందుకే ఇప్పటికీ బాధపడుతుంటాను' - NAYANTHARA Movies - NAYANTHARA MOVIES

నార్త్​, సౌత్​ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకెళ్తోంది లేడీ సూపర్​స్టార్ నయనతార. జానర్​తో తేడా లేకుండా తన నటనతో ఎన్నో హిట్​ సినిమాలను ఖాతాలో వేసుకుంది. అయితే తన కెరీర్​లో ఓ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికీ బాధపడుతుంటానంటోంది. మరి ఆ సినిమా ఏదంటే?

Nayanthara Ghajini Movie
Nayanthara (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 9:57 AM IST

తన వెర్సటైల్ యాక్టింగ్​తో యూత్​ను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. మలయాళం సినిమాలతో సినీ అరంగేట్రం చేసిన ఈ చిన్నది, ఆ తర్వాత తమిళం, తెలుగు సినిమాల్లో మెరిసి మెప్పిచింది. అగ్రహీరోల సరసన నటించి అనతికాలంలోనే మంచి స్టార్​డమ్​ సాధించింది. షారుక్​- అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్'తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ సంపాదించుకుంది. ఒకే జానర్​కు స్టిక్ అవ్వకూండా డిఫరెంట్​ రోల్స్​లో నటించి తానేంటో నిరూపించుకుంది. అయితే తన కెరీర్​లో ఓ క్యారెక్ట్​లో నటించినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి చెప్పగా, ఇప్పుడు ఆ వీడియో మళ్లీ ట్రెండ్ అవుతోంది.

సూర్య లీడ్​ రోల్​లో విడుదలైన 'గజినీ' మూవీ బాక్సాఫీస్ వద్ద మాసివ్ సకెస్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అందులో అసిన్​తో పాటు నయన్​ కూడా ఫిమేల్ లీడ్​గా కనిపించింది. చిత్ర అనే మెడికల్ స్టూడెంట్​గా నయన్ ఈ చిత్రంలో నటించింది. అయితే ఆ పాత్ర త‌న సినీ కెరీర్​లోనే అత్యంత చెత్త ఎంపిక‌ అంటూ వ్యాఖ్యానించింది. తాను ఇప్పటివరకు నటించిన సినిమాల‌ మొత్తంలో 'గజిని'లో యాక్ట్ చేసినందుకు మాత్రమే చింతిస్తున్నానంటూ వెల్లడించింది. ఈ చిత్రంలో తన పాత్రను త‌న‌కు చెప్పినట్లుగా చిత్రీక‌రించ‌లేదని, తనను చెత్త‌గా ఫోటోలు తీశారంటూ చెప్పింది. ఆ సమయంలో ఆ విషయాన్ని తాను పట్టించుకోలేదని దాన్ని ఓ లెర్నింగ్ ప్రాసెస్​గా భావించానంటూ పేర్కొంది.

ఇక నయన్​ చివరిగా 'అన్నపురణి' అనే లేడీ ఓరియెంటడ్​ చిత్రంలో కనిపించింది. నయ‌న్ 75గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందించింది. అంతే కాకుండా పలు విమర్శలను కూడా ఎదుర్కొంది. ప్రస్తుతం యశ్​ 'టాక్సిక్' షూటింగ్‌లో బిజీగా ఉంది. దీంతో పాటు మలయాళంలో నివిన్ పౌలీతో ఓ సినిమాకు సైన్​ చేసినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్​ డ్రామాగా తెరెకెక్కుతున్న 'టెస్ట్'లోనూ కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా'మనగట్టి సిన్స్ 1960' అనే సినిమాలోనూ ఈమె నటిస్తోంది.

ప్రైవేట్​ జెట్​, కాస్ట్​లీ కార్లు - సౌత్​లో రిచెస్ట్​ హీరోయిన్ ఎవరంటే ?

50 సెకెన్లకు రూ. ఐదు కోట్లు - ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.