ETV Bharat / entertainment

అప్పుడు 'దసరా', ఇప్పుడు 'ది ప్యారడైజ్'- నాని, శ్రీకాంత్ మూవీ టైటిల్ ఫిక్స్ - NANI SRIKANTH ODELA MOVIE

నాని- శ్రీకాంత్ ఓదెల మూవీ టైటిల్ అనౌన్స్​- పోస్టర్ షేర్ చేసిన మేకర్స్

Nani Srikanth Odela Movie
Nani Srikanth Odela Movie (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 11:09 AM IST

Nani Srikanth Odela Movie : 'దసరా' వంటి బ్లాక్‌ బస్టర్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో మరో ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఖరారైంది. 'ది ప్యారడైజ్‌' అనే టైటిల్‌ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హీరో నాని టైటిల్‌ లోగోను ఎక్స్‌లో షేర్‌ చేశారు. అయితే శ్రీకాంత్‌ తొలి చిత్రం 'దసరా' కన్నా 'ది ప్యారడైజ్' మూవీలో మాస్ మోతాదు మరింత ఎక్కువగా ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

'ది ప్యారడైజ్' ఒక బోల్డ్, యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. పోస్టర్​లో తుపాకీలు పట్టుకుని కొందరు కనిపిస్తున్నారు. దీంతో ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ మూవీని హైదరాబాద్​లోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ ఎల్ వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి నుంచి 'ది ప్యారడైజ్' మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. నాని కెరీర్‌ లోనే అత్యధిక వ్యయంతో ఈ మూవీ రూపొందనున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీలో స్టార్ నటీనటులను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే కీలక పాత్రల కోసం బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్​ను మేకర్స్ సంప్రదించినట్లు టాక్ వినిపించింది. ఇక మ్యూజిక్ సంచనలం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

దసరా బ్లాక్ బస్టర్
కాగా, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్‌ వద్ద 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' సినిమాలకు పనిచేశారు శ్రీకాంత్‌. ఆ తర్వాత 'దసరా' చిత్రంలో డైరెక్టర్‌ గా మారారు. 2023లో నాని, కీర్తిసురేశ్‌, దీక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. నాని కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తెలంగాణలోని సింగ‌రేణి స‌మీపంలో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ నడిచే కథ ఇంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ 'నెట్‌ ఫ్లిక్స్‌'లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

'మట్కా' టైటిల్​ ఛేంజ్- నాని ట్రెండ్ ఫాలో అవుతున్న వరుణ్!

దీపావళి ట్రీట్​ - రామ్​చరణ్​ 'RC 16', నాని 'హిట్ 3' నుంచి సూపర్ అప్డేట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.