Saripodhaa Sanivaaram Trailer: నేచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'సరిపోదా శనివారం'. ఈ సినిమా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మూవీ ట్రైలర్ మంగళవారం (ఆగస్టు 13) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆదివారం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేశారు. 'అతడి కళ్లల్లో ఫైర్, ఎమోషన్సే అన్నిటికి సమాధానం' అని అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్టులు నాని స్పందించి 'భగభగభగ, భగభగమని' రీ పోస్ట్ చేశారు. కాగా, ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఆగస్టు 29న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
రీసెంట్గా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'అప్పట్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ప్రజల్ని బాగా హింసించేవాడు' అంటూ పోలీస్ పాత్రలో ఉన్న ఎస్ జే సూర్యను ఉద్దేశిస్తూ సన్నివేశాల్ని చూపించారు. ఇక హీరోయిన్ ప్రియాంక కూడా పోలీసు అధికారినిగా కనిపించనుంది. ఈ సినిమాను డైరెక్టర్ వివేక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. 'అంటే సుందరానికి' చిత్రం తర్వాత నాని- వివేక్ కాంబోలో రానున్న రెండో సినిమా ఇది. దీంతో ఈ మూవీపై ఆడియెన్స్‌కు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టైటిల్ రివీల్ వీడియో ఆడియెన్స్‌ను ఆకట్టుకోగా, రీసెంట్గా వచ్చిన టీజర్, పాట కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
That fire and emotion in his eyes say it all 🔥🔥#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/LAdWr5hAJs
— DVV Entertainment (@DVVMovies) August 11, 2024
Saripodhaa Sanivaaram Cast: కాగా, ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు యస్ జే సూర్య విలన్‌గా కనిపించనున్నారు. డి.డి.వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఆర్ఆర్ఆర్ నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఆ మధ్య మూవీటీమ్ తెలిపింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
'గరం గరం'గా సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ - విన్నారా? - Saripodhaa Sanivaaram First Single