ETV Bharat / entertainment

రూ. 100కోట్ల క్లబ్​లోకి 'సరిపోదా శనివారం' - 'ఇప్పుడు సరిపోయిందట'! - Saripodhaa Sanivaaram Collection - SARIPODHAA SANIVAARAM COLLECTION

Saripodhaa Sanivaaram Collection : టాలీవుడ్ స్టార్ హీరో నాని లీడ్ రోల్​లో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' అరుదైన ఘనత సాధించింది. తాజాగా ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్​లో చేరింది.

Saripodhaa Sanivaaram
Saripodhaa Sanivaaram (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 8:22 AM IST

Saripodhaa Sanivaaram Collection : నేచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' తాజాగా రూ .100 కోట్ల క్లబ్​లో చేరింది. ఆగస్టు 29న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తూ, తాజాగా రూ. 100 కోట్ల మార్క్ అందుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో 'బాక్సాఫీస్ శివ తాండవమే' అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ఇప్పుడు సరిపోయింది. మీకు (ప్రేక్షకులు) థ్యాంక్స్ చెప్పము. మీరంతా ఓ ఫ్యామిలీలాగా ఆదరింది, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించారు. పోయారు మొత్తం పోయారు' అని క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు యస్ జే సూర్య కీలక పాక్ర పోషించారు. ఆయన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాని- సూర్య మధ్య యాక్షన్ సీన్స్​ సినిమాకే హైలైట్​గా నిలిచాయి. ఇక నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్​గా నటించింది. సీనియర్ డైరెక్టర్, నటుడు యస్ జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఆయన పాత్రకు ఆల్ ఓవర్ మంచి రెస్పాన్స్ లభించింది. ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా రూపొందించారు. కాగా, నాని కెరీర్​లో వంద కోట్ల మార్క్ దాటడం ఇది రెండోసారి. గతేడాది దసరా సినిమాతో నాని తొలిసారి రూ.100 కోట్ల క్లబ్​లో చేరారు.

Nani SIIMA 2024 : సైమా అవార్డ్స్ 2024 ఉత్తమ తెలుగు నటుడిగా నాని పురస్కారం అందకున్నారు. 2023లో బ్లాక్​బస్టర్​గా నిలిచిన 'దసరా' సినిమాలో నటనకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇక సినిమాలో హీరోయిన్ కీర్తి సురేశ్​ ఉత్తమ నటిగా, దర్శకుడిగా శ్రీకాంత్‌ ఓదెల, సహాయ నటుడిగా దీక్షిత్‌ శెట్టి పురస్కారాలు దక్కించుకున్నారు. ఇక అదే ఏడాది డిసెంబర్​లో రిలీజైన 'హాయ్ నాన్న'కు సైతం అవార్డుల పంట పండింది. ఉత్తమ సహాయ నటి (బేబీ కియారా ఖాన్‌) సహా ఆరు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది.

'సరిపోదా శనివారం' కలెక్షన్స్- 3 రోజుల్లోనే రూ.50 కోట్లు వసూల్ - Saripodhaa Sanivaaram

15రోజులు మాకు నిద్ర లేదు: సక్సెస్​మీట్​లో నాని - Saripodhaa Sanivaaram

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.