Nagendrans Honeymoons One Life Five Wifes OTT : ఓటీటీలో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఐదుగురు భార్యలతో కలిసి భర్త హనీమూన్ ప్లాన్ అనే కామెడీ కథాంశంతో ఇది రాబోతున్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సూరజ్ వెంజరమూడు ఈ చిత్రంలో భర్తగా ప్రథాన పాత్రలో నటిస్తున్నారు. సిరీస్‌కు నాగేంద్రన్స్ హనీమూన్స్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వన్ లైఫ్, ఫైవ్ వైఫ్స్ అనేది ఉపశీర్షిక. ఇంకా ఈ సిరీస్‌లో సూరజ్ వెంజరమూడుతో పాటు కనికుశృతి, గ్రేస్ ఆంటోనీ, ఆల్ఫీ పంజికరన్, శ్వేత మేనన్, నిరంజన అనూప్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా ఈ సిరీస్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ పోస్టర్ బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఐదుగురు ఫిమేల్ లీడ్ యాక్టర్స్ మధ్యలో సూరజ్ వెంజరమూడు భయంభయంగా కూర్చోని ఉండటం సిరీస్‌పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకేసారి ఐదుగురు భార్యలతో కలిసి భర్త ఎందుకు హనీమూన్ ప్లాన్ చేశాడు? ఈ టూర్లో అతడు ఎలాంటి కష్టాలు పడ్డాడు? అసలు అతడు ఐదుగురిని ఎందుకు పెళ్లిచేసుకోవాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ దీనిని విడుదల చేయనున్నారు. . జూన్ మొదటి వారంలో ఈ కామెడీ సిరీస్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ సిరీస్‌కు నితిన్ రెంజీ ఫణిక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ అనే సిరీస్‌లను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూడు కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
కాగా, మలయాళంలో సూరజ్ వెంజరమూడు విలక్షణ నటుడిగా బాగా గుర్తింపు పొందారు. తెలుగులోనూ ఈయన సినిమాలు రీమేక్ అయ్యాయి. హీరోగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్స్ ఆర్టిస్ట్‌గా, కథ నచ్చితే ఎలాంటి పాత్రైనా నటిస్తుంటారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన డ్రైవింగ్ లైసెన్స్, వికృతి, ఆండ్రాయిడ్ కుంజప్పన్, పెరారియతావార్తో పాటు పలు సినిమాలు అవార్డులను కూడా అందుకున్నాయి. ప్రస్తుతం సూరజ్ మలయాళంలో మరో మూడు సినిమాల్లో నటిస్తున్నారు. విక్రమ్ ధీర వీర సూరన్తో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
'హీరో కన్నా ముందు మొదట అలా అవ్వాలనుకున్నాను!' : బాలకృష్ణ - Sathyabhama Trailer
కొత్త ట్రెండ్ - పాన్ ఇండియా సినిమాలన్నీ ఆ రోజే రిలీజ్! - Thursday Movie Releases 2024