Prabhas Kalki 2898 AD America Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ కల్కి మూవీ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. హాలీవుజ్ రేంజ్లో సైన్స్‌కు మైథాలజీని ముడిపెట్టి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. ప్రభాస్‌తో పాటు ఇతర స్టార్ యాక్టర్స్ నటనకు ఆడియెన్స్ ఫిదా అయిపోతున్నారు. కథతో పాటు యాక్షన్ సీన్స్ అదిరిపోయిందని రివ్యూలు ఇస్తున్నారు.
అయితే విడుదలకు ముందే ఎన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న కల్కి రిలీజ్ తర్వాత కూడా అదే హవాను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నార్త్ అమెరికాలోనూ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే పలు చిత్రాల రికార్డులను అధిగమించిన కల్కి ఇప్పుడు మరింత టాప్‌లో నిలిచింది. ప్రీమియర్స్ కలెక్షన్స్‌లోనే 3.8 మిలియన్ డాలర్లతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రీమియర్స్, మొదటిరోజు కలెక్షన్స్ అన్నీ కలిపి అమెరికాలో మొత్తంగా 5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అలాగే అత్యంత వేగంగా 5 మిలియన్లు వసూలు చేసిన సినిమాగానూ రికార్డును నెలకొల్పింది. ఈ వసూళ్లు ఇలానే కొనసాగితే బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేయడం పక్కా అని అభిమానులు అంటున్నారు. ఎలాగే ఇప్పుడు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.
Kalki 2898 AD Worldwide Collections : కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.180 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే తెలుగు సినిమాల్లో మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి 2 రూ. 217 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అంటే ఈ లెక్కన ఈ రెండు చిత్రాలను కల్కి సినిమా బ్రేక్ చేయలేదని తెలుస్తోంది. ఏదేమైనా ఈ చిత్రం లాంగ్ రన్ టైమ్‌లో రూ.1000 కోట్లు పక్కా, రూ.2000 కోట్లు పక్కా అని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.
మూడో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా 'కల్కి' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఎన్ని కోట్లంటే?