Amala comments on Nagachaitanya : అక్కినేని అమల - టాలీవుడ్ కింగ్, మన్మథుడు నాగార్జున రెండో భార్యగా అందరికీ పరిచయమే. నాగ్ మొదటి భార్య లక్ష్మి ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు. వీరికే నాగ చైతన్య పుట్టాడు. అనంతరం కొద్ది కాలానికి వీరిద్దరూ విడిపోయిన తర్వాత అమలను నాగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పలు సినిమాల్లో కలిసి నటించే క్రమంలో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అఖిల్ పుట్టాడు.
అయితే అమల - చైతూ, అఖిల్‌ను ఇద్దరిని సమానంగా ప్రేమను పంచుతుందని చాలా సార్లు మనం వినే ఉంటాం. తాజాగా వీరిద్దరి గురించి అమల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇద్దరి వ్యక్తిత్వాలను, ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో వివరించింది. "చైతన్యను నేను పెంచలేదు. వాళ్ల అమ్మ దగ్గరే పెరిగాడు. చెన్నై నుంచి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్నోడు. సైలెంట్‌గా ఉంటాడు. అఖిల్‌కు బలమైన అన్నయ్యలాంటోడు. ఇద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంటుంది. గొడవలు ఉండవు. చిన్నప్పుడైతే చైతూ ఎప్పుడు ఇంటికి వస్తాడా అని అఖిల్ ఎదురుచూస్తూ ఉండేవాడు. చైతూ వస్తే అమ్మను మరిచిపోయి మరీ అతడి వెనకాలే తోకలాగా తిరిగేవాడు. ఇద్దరి బంధం చూస్తే ఎంతో చూడ ముచ్చటగా అనిపిస్తుంది. అయితే చైతూ నాటీ అబ్బాయి కాదు. సైలెంట్‌గా ఉంటాడు. తన తండ్రితోనే ఎక్కువగా గడిపేందుకు మక్కువ చూపుతాడు. అఖిల్ హైపర్ యాక్టివ్. అన్నీ యాక్టివిటీస్‌లో పాల్గొంటుంటాడు" అని అమల చెప్పుకొచ్చింది.
"ఇక వీరిద్దరి చిత్రాలు విడుదల అవుతున్నాయంటే నా గుండే హైస్పీడ్‌లో కొట్టుకుంటుంది. కానీ లైఫ్ అనేది గొప్ప టీచర్ లాంటిది. సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఫెయిల్యూర్ ఉంటే నిరాశ తప్పక ఉంటుంది. కానీ జీవితంలో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు మనకు అవకాశం ఇస్తుంది. చైతూ, అఖిల్ వాళ్ల నాన్నలానే సినిమా అయిపోగానే దాని రిజల్ట్ నుంచి బయటకు వచ్చేసి రెండో ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టేస్తారు" అని అమల చెప్పుకొచ్చింది.
ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే - చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. అఖిల్ విషయానికొస్తే ఆ మధ్య ఏజంట్‌తో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సోషియో ఫ్యాంటసీగా చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
SSMB 29 కోసం జక్కన్న షాకింగ్ డెసిషన్! - టైటిల్ ఛేంజ్ - కొత్త పేరేంటంటే?
వీకెండ్ సర్ప్రైజ్ - OTTలోకి సడెన్‌గా వచ్చేసిన రూ.470కోట్ల స్టార్ హీరో సినిమా