Nagachaitanya Samantha : హీరో నాగచైతన్య - హీరోయిన్ సమంత విడిపోయినప్పటికీ వీరిద్దరి పేర్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. మరొకరితో రిలేషన్షిప్లో ఉన్నారంటూ, మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇద్దరూ ఏదో ఒక విషయంలో చర్చనీయాంశమవుతూనే ఉంటారు. తాజాగా మరోసారి వీరిద్దరు వార్తల్లోకి ఎక్కారు. ఎందుకంటే సామ్-చైతూ కలిసి మళ్లీ నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
చాలా కాలంగా నాగ చైతన్య ఫ్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య 'దూత' వెబ్ సిరీస్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కూడా ఉంటుందని ఆ మధ్య దర్శకుడు క్రిష్ అన్నారు. ఇప్పుడీ సీక్వెల్లోనే సమంత ఉండబోతుందని బయట కథనాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఇది చూసిన ఫ్యాన్స్ ఇద్దరి కలిసి నటిస్తే బాగుండు, ఇద్దరు మళ్లీ కలిస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇది అయ్యే పనేనా అని అంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే సమంత కెరీర్ కాస్త అటు ఇటుగా సాగుతోంది. చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చిత్రంలో నటించింది. ఇది మంచి హిట్‌ను అందుకుంది. త్వరలోనే ఇండియన్ వెర్షన్ సిటాడెల్(Samantha Citadel Webseries) వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మధ్యే ఆరోగ్యంపై పూర్తిస్థాయి శ్రద్ధ పెట్టేందుకు కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఫారెన్ వెళ్లి సరదాగా గడిపింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ప్రొఫెషనల్ లైఫ్ వైపు అడుగులు వేస్తోంది. ఇటీవలే సిటాడెల్ డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసింది.
నాగ చైతన్య విషయానికొస్తే ప్రస్తుతం ఆయన వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నారు. ఆ మధ్య ఆయన నటించిన లాల్ సింగ్ చద్ధా, కస్టడీ చిత్రాలు భారీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్(Nagachaitanya Thandel Movie) అనే సీ బేస్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.
ఓ అందమైన అమ్మాయి దెయ్యంగా మారితే - OTTలోకి వెన్నులో వణుకు పుట్టించే మూవీ
'అఖండ 2' బిగ్ లీక్ - నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలు లోడింగ్!