ETV Bharat / entertainment

బర్త్​డే ట్రీట్​ - మైథలాజిక‌ల్ థ్రిల్ల‌ర్​లో నాగ చైతన్య - పోస్టర్ అదిరింది - NAGACHAITANYA NC24

అక్కినేని ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్​ - కొత్త సినిమా ప్రకటించిన నాగ చైతన్య - ఆసక్తి రేపుతోన్న సినిమా పోస్టర్​.

Happy Birthday Nagachaitanya NC24
Happy Birthday Nagachaitanya NC24 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 12:39 PM IST

Happy Birthday Nagachaitanya NC24 : అక్కినేని నాగచైతన్య తన ఫ్యాన్స్​కు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. నేడు (నవంబర్ 23) తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. #NC24 పేరుతో ఇది తెరకెక్కనుంది. సుకుమార్‌ రైటింగ్స్ నుంచి ఈ చిత్రం రానుంది. కార్తిక్‌ దండు దర్శకత్వం వహించనున్నారు. పౌరాణిక కథ నేపథ్యంలో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. విరూపాక్ష, కాంతార సినిమాలకు సంగీతం అందించిన లోకాంత్‌ ఈ కొత్త సినిమాకు సంగీతం అందించనున్నారు.

ఇక పోతే నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్‌' సినిమాలో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తోంది. దేశభక్తి అంశాలతో నిండిన రా రస్టిక్‌ లవ్ స్టోరీతో ఇది తెరకెక్కుతోంది. నాగ చైతన్య రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నారు. సాయి పల్లవి డీగ్లామర్‌ లుక్స్‌లో కనిపించనుంది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది. సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి. మరి చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉన్న చైతూకు ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్​ను అందిస్తుందో చూడాలి.

ఏయన్నార్‌ బయోపిక్​పై నాగార్జున ఏమన్నారంటే - గోవాలో గ్రాండ్​గా జరుగుతున్న ఇఫ్ఫీ (IFFI) వేడుకల్లో తన తండ్రి, దివంగత నటుడు ఏయన్నార్‌కు నాగార్జున నివాళులు అర్పించారు. ఏయన్నార్‌ బయోపిక్​ గురించి మాట్లాడారు. "ఏయన్నార్‌ బయోపిక్‌ (ANR Biopic) గురించి ఎప్పుడూ చర్చ వస్తూనే ఉంటుంది. సినిమాగా కన్నా డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన జీవితాన్ని సినిమాగా తీయడం కష్టం. ఆయన జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎదుగుతూనే వెళ్లారు. అలాంటి దాన్ని స్క్రీన్​పై చూడాలంటే బోర్‌ కొడుతుందేమో!. ఎందుకంటే లైఫ్​లో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నట్లు చూపిస్తేనే సినిమా ఆడియెన్స్​ను నచ్చుతుంది. కాబట్టి ఆయన జీవిత కథలో కొన్ని కల్పితాలను యాడ్ చేసి, ఓ డాక్యుమెంటరీగా రూపొందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం" అని నాగార్జున అన్నారు.

పవన్​ కల్యాణ్​పై హీరో నాని కామెంట్స్​ - ఏం చెప్పారంటే?

కిరాక్ పుట్టించేలా 'పుష్ప 2' శ్రీలీల స్పెషల్​​ సాంగ్ ప్రోమో - మీరు చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.