ETV Bharat / entertainment

జంగిల్ సఫారీ టు లండన్ గేట్ వే - శోభితతో చై ప్రేమ చిగురించిందిలా! - Naga Chaitanya Sobhita Love Story - NAGA CHAITANYA SOBHITA LOVE STORY

Naga Chaitanya Sobhita Dhulipala Engagement : సినీ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. నాగచైతన్య, శోభిత ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ జరిగినా వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అయితే వీరి ప్రేమ ఎప్పుడు,ఎలా మొదలైందో తెలుసా?

source Nagarjuna Twitter
Naga Chaitanya Sobhita Dhulipala Engagement (source Nagarjuna Twitter)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 8:18 PM IST

Naga Chaitanya Sobhita Dhulipala Engagement : టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం(ఆగస్ట్ 8) జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్​ మీడియాలో హీరో నాగార్జున పంచుకున్నారు. దీంతో సీక్రెట్​ రిలేషన్​షిప్​ మెయిన్​టెయిన్ చేసిన నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వీరిద్దరూ మధ్య ప్రేమ ఎలా, ఎక్కడ చిగురించిందని తెలుసుకునేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు.

ఫొటోలు లీక్ - నాగ చైతన్య, శోభిత రిలేషన్​ గురించి గతంలోనే ప్రచారం సాగింది. వారిద్దరూ కలిసి బయటికి వెళ్లినప్పుడు కొన్ని ఫోటోలు లీక్ కావడంతో ఈ జంట రిలేషన్ ​షిప్​లో ఉన్నారని నెటిజన్లు భావించారు. అలాగే పలు వేదికలపై నాగచైతన్య, శోభిత కలిసి కనిపించడంపై ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది. దీంతో వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నారని చాలా మంది భావించారు. అయితే తమ రిలేషన్ పై నాగచైతన్య కానీ, శోభితకానీ ఎవరూ స్పందించలేదు. తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ వారిద్దరి హాలీడే ట్రిప్ ఫొటోలు చైతన్య, శోభిత మధ్య బంధాన్ని ప్రపంచానికి తెలియజేశాయి.

ప్రేమ కథ ఎప్పుడు మొదలైందంటే? - సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. 2023 సెప్టెంబరులో శోభిత తన సోషల్ మీడియా హ్యాండిల్​లో ఓ బుక్ ఫొటోను పోస్ట్ చేశారు. అలాగే నాగచైతన్య ప్రొఫైల్​లో కూడా ఇదే ఫొటో ఉంది. దీంతో నాగచైతన్య, శోభిత మధ్య ప్రేమ నడుస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. చైతన్య శోభితకు ఈ బుక్​ను ప్రిఫర్ చేశారని కామెంట్లు వచ్చాయి.

ఆ తర్వాత చైతూ - శోభిత హాలీడే ట్రిప్​కు వెళ్లిన ఫొటోస్ సోషల్​ మీడియాలో దర్శనమయ్యాయి. లండన్ గేట్ వే, యూరప్ పర్యటన ఇలా చాలా సార్లు నాగచైతన్య పక్కన శోభిత కనిపించారు. దీంతో వీరి బంధం గురించి చర్చ మరింత ఎక్కువైంది. ముఖ్యంగా లండన్​ గేట్​ వే ట్రిప్​లో ఓ ఫొటో బాగా హాట్​టాపిక్​గా మారింది. ఈ పిక్​ను ఇండియన్ చెఫ్​ షేర్ చేశారు. ఇందులో చైతూ, శోభిత కలిసి కనిపించడం అందర్నీ షాక్​కు గురి చేసింది.

ఇక నాగ‌చైత‌న్య‌తో పాటు శోభిత కూడా జంగిల్ స‌ఫారీ టూర్ ఫొటోల‌ను షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇద్ద‌రి ఫొటోల్లో ఒకే లోకేష‌న్, బ్యాక్‌ డ్రాప్ కనిపించింది. దీంతో నాగ‌చైత‌న్య, శోభిత ఇద్ద‌రు క‌లిసే టూర్​కు వెళ్లినట్లు కన్ఫామ్ అయింది. అలా వీరి ప్రేమ కథ నడిచింది.

కాగా, నటి సమంతను నాగచైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత వీరిద్దరు తమ మూడు ముళ్ల బంధానికి గుడ్ బై చెప్పి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శోభితతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల డేటింగ్ తర్వాత గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.

8.8.8 నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థ ముహూర్తం స్పెషల్ ఏంటో తెలుసా? - Naga Chaitanya Sobhita Dhulipala

ఇట్స్​ అఫీషియల్- నాగచైతన్య, శోభిత పెళ్లి కన్ఫామ్​ చేసిన నాగార్జున - Shobita Naga Chaitanya Engagement

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.