Naga chaitanya Pooja Hegde New Movie : టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగచైతన్య, అందాల భామ పూజా హెగ్డే జోడీ కూడా ఒకటి. వీరి కాంబోలో వచ్చిన ఒక లైలా కోసం సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆక్టటుకుంది. అయితే ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. కానీ త్వరలోనే ఈ జంట కలిసి నటించబోతుందని కొద్ది రోజులు క్రితం వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా మరోసారి ఆ ప్రచారం ఊపందుకుంది. విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు నాగ చైతన్యతో కలిసి ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసమే హీరోయిన్‌గా పూజా హెగ్డేను మేకర్స్ తీసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారట. దీంతో చైతూ - పూజా హెగ్డే కాంబినేషన్ త్వరలోనే సెట్ కానుందని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఈ చిత్రంతో నిజంగానే చైతూ-పూజా కాంబో ఫిక్స్ అవుతుందా లేదా అనేది.
Pooja Hegde Upcoming Movies : కాగా, పూజా హెగ్డేకు గత మూడేళ్లుగా సరైన హిట్ పడలేదు. రాధేశ్యామ్‌తో మొదలై బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసి కా భాయ్ కిసీ కీ జాన్ అన్నీ చిత్రాలు ఫ్లాప్‌గా నిలిచాయి. దీంతో ఆమె మేకర్స్ కాస్త పక్కన పెట్టారు. అయితే ఈ మధ్యే మళ్లీ పూజాకు ఆఫర్లు మొదలయ్యాయి. దేవా, సూర్య 44, దళపతి 69 సినిమాల్లో ఛాన్స్‌లను అందుకుంది. ఇక తెలుగులో చైతూతో ప్రాజెక్ట్ ఓకే అయితే ఆచార్య తర్వాత ఇదే ఆమె తెలుగు సినిమా అవుతుంది.
నాగచైతన్య విషయానికొస్తే ఆయన కూడా గత కొద్ది కాలంగా విజయాన్ని చూడలేదు. ఆ మధ్య ఓటీటీలో వచ్చిన దూత మాత్రమే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆయన చందూ మొండేటితో కలిసి తండేల్(Naga chaitanya Thandel Movie) చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంపైనే చైతూ ఆశలన్నీ పెట్టుకున్నారు.
'కంగువా 2'లో దీపికా పదుకొణె? - నిర్మాత సమాధానమిదే
ఇంటెన్సివ్‌గా 'కుబేర' గ్లింప్స్ - డబ్బు చుట్టూ సాగే ఎమోషన్స్