ETV Bharat / entertainment

చైతూతో మరో సారి!- స్క్రీన్​పై మెరవనున్న 'ఒక లైలా కోసం' కపుల్ - Pooja Hegde Upcoming Movie - POOJA HEGDE UPCOMING MOVIE

Naga Chaitanya Pooja Hegde Movie : 'ఒక లైలా కోసం' సినిమాతో సూపర్ పెయిర్ అనిపించుకున్న నాగచైతన్య, పూజా హెగ్డే మరోసారి ఆన్​స్క్రీన్​ కపుల్​గా కనిపించనున్నారు. ఆ విశేషాలు మీ కోసం

Naga Chaitanya Pooja Hegde Movie
Naga Chaitanya Pooja Hegde Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 10:42 AM IST

Updated : Apr 30, 2024, 12:04 PM IST

Naga Chaitanya Pooja Hegde Movie : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఈ సినిమా తర్వాత ఆయన విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.

చైతూ కోసం కార్తిక్​ ఓ విభిన్నమైన థ్రిల్లర్‌ కథని సిద్ధం చేశారట. ప్రస్తుతం ఆ మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. 'ఒక లైలా కోసం' సినిమాలో చైతూతో కలిసి నటించిన పూజా హెగ్డే మరోసారి చైతూతో నటించనున్నారట. ప్రస్తుతం మూవీ టీమ్ ఈ విషయం గురించి సుదీర్ఘ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ సెట్ అయితే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కూడా ఇచ్చే ఛాన్సెన్స్ ఉన్నాయని సినీ వర్గాల మాట.

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్‌ అట్లీ కాంబోలో సినిమార రానున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ప్రాజెక్ట్‌ గురించి అట్లీ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ సినిమాలో పూజా హెగ్డేకు అవకాశం ఇచ్చారంటూ టాక్ నడుస్తోంది.

మరోవైపు నందినీరెడ్డి - సిద్దూ జొన్నలగడ్డ కాంబోలో రానున్న సినిమాలోనూ పూజా హెగ్డే మెరవనుందట. అయితే ఈ సినిమాలో ఫీమేల్​ లీడ్​గా సమంతను తీసుకోవాలని మేకర్స్ భావించారట. అయితే సామ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడం వల్ల ఆమె ప్లే పూజాను తీసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి గురించి కూడా నెట్టింట తెగ చర్చలు జరిగాయి. కానీ ఆయా మూవీ టీమ్స్ ఈ విషయాలపై ఇప్పటివరకు స్పందించలేదు.

ఇక పూజా గతేడాది 'కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌' అనే సినిమాలో నటించింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన ఈ సినిమాలో మెరిసింది. భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయిది. ఆ తర్వాత 'గుంటూరు కారం'లోనూ పూజా నటించింది. కానీ ఆ సినిమా షూటింగ్​ నుంచి పూజా అనూహ్యంగా తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో శ్రీ లీల నటించింది. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత పూజా మరే చిత్రాన్ని ప్రకటించలేదు. టాలీవుడ్​కు దూరంగా ఉంటూనే బాలీవుడ్​లో ఆఫర్లకు ప్రయత్నిస్తోంది.

పాపం పూజా హెగ్డే - ఎట్టకేలకు స్టార్ కిడ్ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​!

'దుబాయ్​లో గొడవ, చంపుతామని బెదిరింపులు'- పూజా హెగ్డే టీమ్ క్లారిటీ

Last Updated : Apr 30, 2024, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.