Kalki 2898 AD Movie Top 10 Records : నాగ్ అశ్విన్ - ప్రభస్ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.555 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ క్రమంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. అలానే పలు రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
- ఒక వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించి తొలి చిత్రంగా కల్కి నిలిచింది. ఇప్పటివరకూ షారుక్ ఖాన్ జవాన్ పేరిన ఉన్న రూ.520.79 కోట్లు రికార్డ్ బ్రేక్ అయింది.
- నార్త్ అమెరికాలో తొలి వీకెండ్‌లోనే 11 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.90 కోట్లు) సాధించిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది.
- జర్మనీలోనూ కల్కి 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. మొదటి వీకెండ్‌లో రూ.2.25కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆర్‌ఆర్ఆర్, సలార్, బ్రహ్మాస్త్ర, కేజీయఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసింది.
- మలేషియాలో సలార్ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డు కల్కి (తమిళ వెర్షన్) బద్దలు కొట్టింది. మూడు రోజుల్లో రూ.2.2 కోట్లు వసూలు చేసింది. సలార్ ఫుల్ రన్‌టైమ్‌లో ఈ మార్క్‌ను టచ్ చేసింది.
- ఇండియాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా కల్కి నిలిచింది. హను-మాన్ రూ.350 కోట్లు ఫుల్ రన్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.
- ఈ ఏడాది తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగానూ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రూ.191.5కోట్లు కలెక్ట్ చేసింది.
- వరల్డ్ బాక్సాఫీస్‌లో కల్కి హవా కొనసాగిస్తోంది. ఇన్‌సైడ్ అవుట్ 2(1 బిలియన్ డాలర్లు), ఎ క్వైట్ ప్లేస్ : డే వన్(98.5 మిలియన్ డాలర్లు) సినిమాలకు దీటుగా వసూళ్లను సాధిస్తూ మూడో స్థానంలో నిలిచింది. కల్కి 2898 ఏడీ ఇప్పటివరకు 66 మిలియన్ డాలర్లను సాధించింది.
- ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-3(ఆర్‌ఆర్ఆర్ రూ.223 కోట్లు, బాహుబలి 2 రూ.217) చిత్రాల జాబితాలో కల్కి నిలిచింది.
- కెనడాలో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది.
'కల్కి'లో ఈ హీరో ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదట! - Kalki 2898 AD Movie
ప్రభాస్ ఇన్‌స్టా సంగతులు - మన డార్లింగ్ ఫాలో అయ్యేది ఎవరినో తెలుసా? - Prabhas Instagram