Mystery And Thriller Telugu Web Series : ఇప్పటి కాలంలో సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో, ఓటీటీల్లో ఉన్న కంటెంట్‌కు అంతే క్రేజ్ ఉంది. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఈ కంటెంట్‌కు వ్యూవర్స్ కూడా ఇంతకింత పెరిగిపోయారు. తమ బిజీ లైఫ్స్లో థియేటర్లకు వెళ్లడానికి వీలుకానీ సినీ ప్రియులు అప్పుడుప్పుడు ఇంట్లో తమకిష్టమైన సినిమాలను స్ట్రీమ్ చేసుకుంటుంటారు. ఇక అలాంటి వారికోసమే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో కంటెంట్ అందుబాటులో ఉంచుతోంది. ముఖ్యంగా థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారి కోసం తాజాగా పలు సినిమాలు, సిరీస్‌లు రిలీజయ్యాయి. వాటిని మీరూ ఓ లుక్కేయండి.
కుడి ఎడమైతే
వినూత్నమైన కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది 'కుడి ఎడమైతే' సిరీస్. పవన్ కుమార్ రూపొందించిన ఈ థ్రిల్లర్ కమ్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ సమయం తెలియనంత డీప్‌గా కథలోకి తీసుకెళ్లిపోతుంది. అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా కథ నడుస్తోంది. వీళ్లిద్దరూ ఒక రోజు అనుకోకుండా టైమ్ లూప్‌లో ఇరుక్కుపోతారు. పదేపదే అదే ఘటనను ఎదుర్కొంటూ వాళ్లు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు. అందులో నుంచి ఎలా బయటపడ్డారనేది కథనం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉన్న ఈ సిరీస్‌కు మీ వాచ్‌లిస్ట్‌లో పెట్టేసుకోండి మరి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లాక్‌డ్
చాలా కూల్‌గా కనిపించే ఓ హీరో సడెన్‌గా వయెలెంట్‌గా మారిపోతాడు. డాక్టర్ అయిన సత్యదేవ్ ఇంటికి వచ్చిన వాళ్లంతా అనూహ్యంగా తెలుసుకున్న వాస్తవాలకు బిత్తరపోతారు. కథ మొత్తం ప్రముఖ న్యూరో సర్జన్ అయిన సత్యదేవ్ చుట్టూనే తిరుగుతుంటుంది. హీరోను నాశనం చేయాలనుకుని చేసిన ప్రయత్నంతోనే కథ మలుపు తిరుగుతుంది. అప్పుడు బయటపడిన సీక్రెట్ అతని చుట్టూ ఉన్న పాత్రలనే కాదు. చూసే ప్రేక్షకుడిని కూడా భయానికి గురి చేస్తాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఎలెవన్త్ హవర్
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో రూపుదిద్దుకొన్న సిరీస్ ఇది. సక్సెస్‌ఫుల్ మహిళా వ్యాపారవేత్తను పడగొట్టడానికి పలువురు జరిపే కుట్రను చేధిస్తూ కథ నడుస్తుంది. ఆద్యంతం ఊహించని మలుపులతో స్టార్ పర్‌ఫార్మెన్స్‌లతో తెరకెక్కించారు. అధిక నిర్మాణ విలువలతో కార్పొరేట్ వాతావరణాన్ని కళ్లకుకట్టినట్లు చూపించారు. ఎమోషనల్ గా బలపడుతూనే సవాళ్లను ఎదుర్కొని తన వ్యాపారాన్ని కాపాడుకోగలుగుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అన్య ట్యూటోరియల్
అన్య ట్యూటిరియల్ అనే వెబ్ సిరీస్ ఒక హర్రర్ థ్రిల్లర్. మధు (రెజీనా కసండ్రా), అన్య (నివేదిత)ల మధ్యనే కథ తిరుగుతుంటుంది. ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయిన అన్య జీవితంలోకి పారానార్మల్ యాక్టివిటీస్ ప్రవేశిస్తాయి. దాంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన అన్య మీద పోలీసులకు అనుమానం వస్తుంది. కొందరు పిల్లలు కనిపించకపోవడంతో అన్యనే ఆ పని చేసి ఉండొచ్చని.. ఆమె దాచి ఉంచిన రహస్యమేంటని జరిపిన సెర్చింగ్ తో సిరీస్ రూపొందించారు. అన్య, మధుల మధ్య క్లైమాక్స్ సీన్ హైలెట్ అని చెప్పాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నలుగురు వ్యక్తులు ఒక డీల్ ను తప్పుగా చేయడం వల్ల చిక్కుల్లో ఇరుక్కుపోతారు. మోసగాడైన రాజకీయ నాయకుడి చేతిలో కీలుబొమ్మలా మారాల్సి వస్తుంది. ఆ సమస్య నుంచి వాళ్లెలా బయటపడ్డారు. అండర్ వరల్డ్‌ను శాసిస్తున్న ఆ పొలిటీషియన్ ను ఎలా చిత్తు చేశారనేది మిగిలిన కథ. సిరీస్ ఆసాంతం మంచి పవర్ ప్యాక్‌డ్ పర్‌ఫార్మెన్స్ చూడొచ్చు.
ఏజెంట్ ఆనంద్ సంతోష్
పోలీస్ కథలను ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయీస్. కొంచెం హ్యూమర్ టచ్‌తో పాటు సస్పెన్స్‌తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఏజెంట్ ఆనంద్ సంతోష్. చురుగ్గా, స్మార్ట్‌గా కనిపించే డిటెక్టివ్ చుట్టూ కథ తిరుగుతుంటుంది. తాను పనిచేసే సంస్థ తీసుకునే నిర్ణయాల కారణంగానే సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిసి వాటి నుంచి ఎలా బయటపడ్డాడనేది మిగిలిన కథాంశం.
ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
అందం, స్వేచ్ఛ, ప్రేమ, గొప్పదనం, కామం ఇవేనా మనిషిని నేరాలు చేయడానికి ప్రేరేపించేది? మనిషి రక్తపాతం చేయడానికి కారణమేమై ఉంటుంది. ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానమే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. పోసాని కృష్ణ మురళి, నందిని రాయ్‌లు ప్రధాన పాత్రలుగా కనిపించినా అనేకమంది తారాగణంతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్.
ఈ వారం టాప్ 10 సిరీస్ ఇవే - వేరే లెవెల్ థ్రిల్ పక్కా!
రొటీన్ సినిమాలతో బోర్ కొట్టేసిందా? హారర్ వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదిగో- ఎంటర్టైన్మెంట్ పక్కా!