ETV Bharat / entertainment

'ప్లీజ్​ అలా అనొద్దు, అలాంటి పదాలు వాడొద్దు' : సంగీత దర్శకుడు తమన్‌ - Thaman GameChanger Movie - THAMAN GAMECHANGER MOVIE

Music Director Thaman Reacted on Trolls : సంగీత దర్శకుడు తమన్​ గేమ్​ ఛేంజర్​ విషయమై ఫ్యాన్స్​ చేసే ట్రోల్స్​కు స్పందించారు. ఏమన్నారంటే?

source ETV Bharat
Music Director Thaman (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 8:02 PM IST

Music Director Thaman Reacted on Trolls : సంగీత దర్శకుడు తమన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్​ను అందించారు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఆయనపై విమర్శలు వస్తుంటాయి. సోషల్ మీడియాలో ఆయన్ను తెగ ట్రోల్ చేస్తుంటారు. అయితే తాజాగా ఆయన కొందరు సినీ అభిమానులు, పలువురు నెటిజన్లకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

అసలేం జరిగిందంటే? - సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా విడుదల ఆలస్యమైనా, అప్డేట్స్ ఇవ్వకపోయినా సినీ ప్రియులు, ఫ్యాన్స్​ అసహనం వ్యక్తం చేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా అప్డేట్స్ ఇవ్వమంటూ మూవీటీమ్​ను ట్రోల్​​ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం గేమ్​ ఛేంజర్ విషయంలో అదే జరుగుతోంది. దర్శకుడు శంకర్ ఈ సినిమాను చాలా కాలంగా తెరకెక్కిస్తున్నారు. దీంతో అప్‌డేట్స్‌ ఆలస్యం కారణంగా ఫ్యాన్స్ అసహనానికి గురౌతున్నారు. మూవీటీమ్​ను ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా నిర్మాణ సంస్థ, దర్శకుడినుద్దేశిస్తూ అసభ్య పదజాలంతో ట్రోల్స్‌ చేశారు. ఈ క్రమంలోనే తమన్​ స్పందించినట్లు తెలుస్తోంది.

"డియర్‌ బ్రదర్స్‌ అంతా సరిగ్గానే జరుగుతోంది. ఈ మూవీ అప్‌డేట్‌ కోసం మీరెంత కాలంగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకున్నాను. మీ ప్రోత్సాహం, ప్రేమే మాకు అవసరం. ఏ సినిమా అయినా మీ కోసమే చేస్తాం. సినిమాకు మీరు రక్తం లాంటి వారు. కానీ మీరు ఇలా దిగజారి అసభ్య పదజాలంతో హ్యాష్‌ట్యాగ్స్‌ క్రియేట్‌ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి అసభ్యకరమైన ట్వీట్స్​ చేయొద్దు. వారంతా ఫిల్మ్ ఇండస్ట్రీకి, సమాజానికి ఎంతో చేశారు. వారిని మనం గౌరవిద్దాం. ఒకరినొకరు సపోర్ట్‌ చేసుకుందాం" అని రాసుకొచ్చారు.

ఇకపోతే గేమ్​ ఛేంజర్ ప్రమోషన్స్​ను ఆగస్టు నెలాఖరు నుంచి వేగవంతం చేస్తామని తమన్‌ ఓ ఈవెంట్​లో చెప్పారు. వినాయక చవితి సందర్భంగా శనివారం ఓ సర్‌ప్రైజ్‌ కూడావస్తుందని హింట్‌ ఇచ్చారు. దీంతో #GameChanger హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండింగ్‌ అవుతోంది. ప్రస్తుతం తమన్​, ప్రభాస్‌ 'ది రాజాసాబ్‌', పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ', సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' సహా పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.

'ది గోట్' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ అఫీషియల్ డీటెయిల్స్​ - ఏకంగా ఎంత వసూలు చేసిందంటే? - The GOAT First Day Collections

ప్రభాస్ 'రాజాసాబ్'​ - ఆ రూమర్స్​ నిజం కాదట! - Prabhas Rajasaab Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.