ETV Bharat / entertainment

'డ్రెస్సుల కోసం నేను ఎక్కువ ఖర్చు చేయను - నా సంపాదన అంతా అందులోనే ఇన్వెస్ట్ చేస్తాను' - Mrunal Thakur Investment - MRUNAL THAKUR INVESTMENT

Mrunal Thakur Investment : టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన మృణాల్ వరుస విజయాలతో దూసుకుపోతుంది, త్వరలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో పలకరించనున్న ఈ భామ తన గురించి కొన్ని విశేషాలు షేర్ చేసుకుంది.

Mrunal Thakur Investment
Mrunal Thakur Investment
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 5:32 PM IST

Mrunal Thakur Investment : 'సీతారామం' సినిమాతో తెలుగు తెరకు పరిచమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్​. తొలి సినమాతోనే సౌత్​లో సూపర్ ఫేమస్ అయ్యిన ఈ చిన్నది ఆ తర్వాత 'హాయ్​ నాన్న'తో మరింత పాపులరైంది. ఇందులో తన నేచురల్ యాక్టింగ్​కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో టాలీవుడ్​లో వరసు ఆఫర్లు అందుకుని దూసుకెళ్తోంది మృణాల్. ఇందులో భాగంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో కనిపించనుంది.

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్​ పలు ప్రమోషనల్ ఈవెంట్స్​లో సందడి చెేస్తోంది. అందులో భాగంగానే మృణాల్​ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాతో పాటు తన కెరీర్​ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

తెలుగులో తను హీరోయిన్​ గా నటించిన మొదటి సినిమా 'సీతారామం' సినిమా షూటింగ్ విశేషాలను పంచుకుంది. ఆ సినిమాలో యాక్ట్​ చేసే సమయానికి తనకు తెలుగు రాదని అయినా ఆ తెలుగు డైలాగులను ఇంగ్షీష్​లో రాసుకుని ప్రాక్టీస్ చేయడం వలనే ఆ పాత్ర అంత సహజంగా వచ్చిందని తెలిపింది. అయితే తన మాతృ బాష మరాఠిలో కన్నా తెలుగు డైలాగులు చెప్పడం కష్టంగా అనిపించిందని అప్పుడే షూటింగ్​లో పక్కన ఉన్న దుల్కర్​తో ఇదే తన చివరి తెలుగు సినిమా అని చెప్పానని గుర్తు చేసుకుంది. అప్పుడు దుల్కర్ ఆ సినిమా తర్వాత తనకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయంటూ ఎంకరేజ్ చేశారని తెలిపింది. సినిమా విడుదల అయ్యాక అదే నిజం అయిందంటూ మృణాల్ ఆనందం వ్యక్తం చేసింది.

అంతేకాకుండా సినిమాల్లో తాను కష్టపడి సంపాదించింది అంతా ఎక్కువగా బంగారం, స్థిరాస్తులు లాంటి వాటి మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందట. తనవద్ద ఉన్న ఖరీదైన డ్రెస్ వెల కేవలం రూ. 2 వేలు అని చెప్పింది. ఈవెంట్స్​కు తను వేసుకునే బట్టలన్నీ ఫ్యాషన్ డిజైనర్స్ ఇచ్చినవంటూ చెప్పింది మృణాల్.

తొలిసారి ఫ్యామిలీని పరిచయం చేసిన మృణాల్​ - మ్యాజిక్ అంటూ ఎమోషనల్​! - Mrunal Thakur Family

బంపర్​ ఆఫర్​ కొట్టేసిన మృణాల్​ ఠాకూర్! పాన్​ ఇండియా స్టార్​తో సినిమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.