Most Expensive Weddings : ఒకప్పుడు రాజుల కాలంలో 5 రోజుల పాటు పెళ్లిళ్లు అట్టహాసంగా జరిగేవి. 400 ఏళ్ల క్రితమే షాజహాన్ తన కుమారుడు దారాషికో వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించాడు. ఇది మొఘల్ చరిత్రలో గొప్ప పెళ్లి అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ పెళ్లి కోసం షాజహాన్ రూ.32లక్షల ఖర్చు చేశారట. అంటే ఇప్పటి కాలంలో వేల కోట్లతో సమానమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా తన కుమారుడు, కూతురు వివాహం ఎంతో ఘనంగా జరిపించారు. ఇప్పుడు చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం కూడా ఓ రేంజ్ లో జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఇంత ఘనంగా పారిశ్రామిక వేత్తలే కాదు సెలబ్రెటీల పెళ్లిళ్లు జరిగాయి. వేల కోట్లలో ఖర్చు చేసి మరి చేసుకున్నారు. కళ్లు చెదిరిపోయే డెకరేషన్లు, అదిరిపోయే వెడ్డింగ్ డెస్టినేషన్లు, రాజమహల్స్కు తీసిపోని వివాహ వేదికలు ఇలా ఓ రేంజ్ లో ఉంటుంది హడావిడి. మరి అత్యంత ఖరీదైనా పెళ్లిళ్లు ఎవరూ చేసుకున్నారు. ఎంత ఖర్చు చేశారో చూద్దాం.
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ : ఈ బాలీవుడ్ జంట రాజస్థానలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో నాలుగు రోజుల పాటు జరిగాయి. అయితే ఈ పెళ్లికి ఏకంగా రూ.4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా : ఈ బాలీవుడ్ క్యూట్ జంట వివాహం రాజస్థాన్‌లోని సూర్యగడ్ ప్యాలెస్ జరిగింది. రోజు రూ. 2 కోట్లు చొప్పున మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడకకు రూ. 6 కోట్లు ఖర్చు చేశారు.ఇది కేవలం పెళ్లికి, డెకరేషన్స్ కోసం పెట్టిన ఖర్చు మాత్రమే.
ఆలియా భట్, రణబీర్ కపూర్ : ఈ జంట బాంద్రాలోని తమ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నారు. అయినప్పుటికీ ఖర్చులో ఏ మాత్రం తగ్గలేదు. రూ.10 కోట్లతో ఘనంగా చేసుకున్నారు.
దీపికా, రణవీర్ సింగ్ : బాలీవుడ్ లవ్ బర్డ్స్ డిస్టినేషన్ పెళ్లి చేసుకున్నారు. ఇటలీ జరిగిన ఈ పెళ్లికి రూ.77 కోట్లు ఖర్చు చేశారు.
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ : ఇండియన్ సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీస్‌లో అత్యంత ఖరీదైన పెళ్లి విరాట్ కోహ్లీ- అనుష్కది. వీళ్ల వివాహం ఇటలీలో జరిగింది. అతి తక్కువ మంది సమక్షంలో జరిగిన వేడకకు ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేశారు.
రాహుల్, అతియా శెట్టి: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం కూడా ఘనంగా జరిగింది. మహారాష్ట్ర ఖండాలలోని ఫామ్‌హౌస్‌లో చేసుకున్నారు. ఈ వేడకకు రూ.4.5 కోట్లు ఖర్చు చేశారు.
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ లీలా ప్యాలేస్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడకుకు భారీగానే ఖర్చు చేశారు.
రామ్‌చరణ్ - ఉపాసన : టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ ఉపాసనను 2012లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి 15కోట్ల వరకు ఖర్చు చేశారట.
అల్లు అర్జున్, స్నేహారెడ్డి : టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పెళ్లికి ఏకంగా 10 కోట్లు ఖర్చు చేశారు. జూనియల్ ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి వివాహానికి రూ.18 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవలే మెగా హీరో వరణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో జరిగింది. వీరి పెళ్లికూడా భారీ డబ్బులు ఖర్చు చేశారని టాక్.
అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో 'నాటు నాటు' ఫీవర్ - చెర్రీతో స్టెప్పులేసిన బాలీవుడ్ తారలు
సెలైంట్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంగేజ్మెంట్ - కాబోయే మొగుడు ఎవరంటే?