ETV Bharat / entertainment

మోక్షుకు తారక్ స్పెషల్ విషెస్ - నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ! - Jr NTR Wishes Mokshagna - JR NTR WISHES MOKSHAGNA

Mokshagna Jr NTR : నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విషెస్ నడుమ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ అదేంటంటే?

Jr NTR Mokshagna
Jr NTR Mokshagna (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 12:59 PM IST

Mokshagna Jr NTR : నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకంక్షలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా జూనియర్‌ ఎన్‌టీఆర్ పోస్ట్‌ నందమూరి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. తన సోదరుడు మోక్షూకు బర్త్‌డే విషెస్ చెప్పిన తారక్‌, దాంతో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినందకు అభినందనలు తెలిపారు.

"సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవ శక్తులు నీపై ఆశీస్సులు కురిపించాలని కోరుకుటుంన్నాను! హ్యాపీ బర్త్‌డే మోక్షూ" అంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలానే ఉండాలని అంటున్నారు.

ఇదిలా ఉండగా, నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ కూడా తన తమ్ముడు మోక్షజ్ఞకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. "టిన్సెల్ టౌన్‌కు నీకు స్వాగతం మోక్షు. తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్‌డే" అంటూ ట్వీట్‌ చేశారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు మోక్షజ్ఞ. నీ అరంగేట్రం కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. రానున్న ఏడాదిలో నువ్వు ఎన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను - గోపిచంద్‌ మలినేని

మా మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు నీకు అభినందనలు. ఎన్నో అవకాశాలు నీకు రావాలి. ఆల్‌ ది బెస్ట్ - డైరెక్టర్ బాబీ.

తాతగారి ఆశీస్సులతో మీ చలనచిత్ర ప్రస్థానం అత్యద్భుతంగా మొదలై ఆద్యంతం అమోఘంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను - లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి

ఇదిలా ఉండగా, రెండు రోజులుగా ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హింట్ ఇస్తూ వచ్చారు. 'నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది', 'వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం' అంటూ వరుస పోస్ట్‌లు పెట్టారు. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను షేర్ చేస్తూ తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకుగాను బాలకృష్ణకు డైరెక్టర్ ప్రశాంత్ థాంక్స్ చెప్పారు. ఇక ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రెండో ప్రాజెక్ట్‌గా రానున్న సినిమాలో మోక్షజ్ఞ హీరోగా అలరించనున్నారు.

టాలీవుడ్​కు కొత్త అందాలు - నందమూరి వారసుల కోసం ఇద్దరు భామలు - Tollywood Upcoming New Heroines

'సింబా'పై ప్రశాంత్ వర్మ మరో సూపర్ అప్డేట్‌ - నందమూరి ఫ్యాన్స్‌లో పెరిగిన జోష్‌ - Prasanth Varma Mokshagna

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.