ETV Bharat / entertainment

అక్క ప్రొడక్షన్​లో తమ్ముడి సినిమా- మోక్షజ్ఞ డెబ్యూ మూవీ నిర్మాత 'ఆమె'నే! - Mokshagna Debut Film Producer - MOKSHAGNA DEBUT FILM PRODUCER

Mokshagna Debut Film Producer : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి చిత్రానికి ప్రొడ్యూసర్ ఎవరంటే?

Mokshagna
Mokshagna (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 7:59 AM IST

Mokshagna Debut Film Producer : నందమూరి బాలకృష్ణ వారసత్వం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందంటేనే ఒక సెన్సేషన్. బాలయ్య క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ఆయన తనయుడు తొలి సినిమా అనేసరికి భారీ అంచనాలు పెట్టేసుకున్నాయి సినీ వర్గాలు. ఆ ఎంట్రీ సినిమా గురించి ఏ అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. రీసెంట్‌గా మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అవ్వనున్న సినిమాకు ఇటీవల 'హనుమాన్' సినిమాతో సక్సెస్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరక్షన్ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

అయితే ఈ సినిమా నుంచి మరో కీలక అప్​డేట్​ తాజాగా బాలయ్యనే స్వయంగా వెల్లడించారు. అదేంటంటే ఈ చిత్రానికి తన కుమార్త తేజస్వినీనే ప్రొడ్యూస్ చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్​డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబరులో మొదలుపెట్టాలనుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. డైరక్టర్, ప్రొడ్యూసర్ దాదాపు కన్ఫమ్ అయిపోగా మిగిలిన నటీనటులు ఎవరనేది తెలుసుకునేందుకు కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు మరి.

మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో మోక్షూ గురించి బాలయ్య పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. "మోక్షజ్ఞ క్లాస్‌లో ఎప్పుడూ టాపరే. అమెరికాలో బీబీఎమ్‌ చదివొచ్చాడు. వీలుచిక్కినప్పుడల్లా నాతోపాటు పాత సినిమాలు చూస్తుంటాడు. తనకు సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉందని అర్థమయ్యే నేను తనను ఈ ఫిీల్డ్​లోకి వచ్చేందుకు ప్రోత్సహిస్తున్నాను. త్వరలోనే తన ఎంట్రీ గురించి ప్రకటిస్తాను." అని బాలయ్య అన్నారు.

టాలీవుడ్​కు కొత్త అందాలు - నందమూరి వారసుల కోసం ఇద్దరు భామలు - Tollywood Upcoming New Heroines

హీరో రెడీ, మరి సినిమా ఎప్పుడు? - మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటోషూట్ వీడియో వైరల్ - Mokshagna Nandamuri

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.