Mirzapur Ali Fazal Dream : బాలీవుడ్ స్టార్ హీరో అలీ ఫజల్ తాజాగా 'మీర్జాపూర్ 3'తో మాసివ్ సక్సెస్ అందుకున్నారు. ఇందులోని ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొని సందడి చేశారు. అందులో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూనే, తన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
"యాక్టర్ కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఓ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌ని. దేశం తరఫున ఆడాలని చిన్నతనంలోనే ఎన్నో కలలు కన్నాను. స్కూల్ డేస్‌లో నాకో యాక్సిడెంట్ జరిగింది. దాని వల్ల భుజానికి తీవ్ర గాయమైంది. అయితే గాయం మానిన తర్వాత తిరిగి బాస్కెట్‌బాల్ ఆడేందుకు ఎంతగానో ప్రయత్నించాను కానీ అది వీలుపడలేదు. అంతేకాకుండా ఆటలకు దూరంగా ఉండాలని వైద్యులు కూడా చెప్పడం వల్ల యాక్టింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాను. మీర్జాపూర్‌లో నటించినప్పుడు ఈ సిరీస్ వర్కౌట్ అవుతుందని, ఇంతటి ఘన విజయాన్ని అందుకుంటుందని మేం అస్సలు ఊహించలేదు. రిలీజైన కొన్ని రోజుల పాటు ఎవ్వరూ దీని గురించి మాట్లాడుకోలేదు. వారం రోజుల తర్వాతనే ఆ షో కాస్త ఊపందుకుంది. ఇక అప్పటి నుంచి మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఫారిన్ కంట్రీస్‌లో ఇటువంటి కంటెంట్‌తో ఎన్నో సినిమాలు, షోలు వస్తున్నాయి. అందుకే ఇందులోయాక్ట్ చేసేందుకు నేను భయపడలేదు" అని అలీ పేర్కొన్నారు.
మీరు గుడ్డూ భయ్యా ఫ్యాన్సా? అయితే ఈ బెస్ట్ మూవీస్ మీ కోసమే! - Ali Fazal Movies
గుడ్డూ భయ్యా ఎమోషనల్ పోస్ట్.. 'మీర్జాపూర్ 3' అప్డేట్.. దాన్ని మీరు నమ్మకపోవచ్చంటూ..