ETV Bharat / entertainment

పవన్ కల్యాణ్​పై బాలీవుడ్ స్టార్ యాక్టర్​ ప్రశంసలు - ఏం అన్నారంటే? - BOLLYWOOD ACTOR ON PAWAN KALYAN

Pawan Kalyan : టాలీవుడ్ పవర్ స్టార్​ పవన్ కల్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​పై బీటౌస్ స్టార్ నటుడు ప్రశంసలు!

Pawan Kalyan
Pawan Kalyan (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 3:23 PM IST

Pawan Kalyan Pankaj Tripathi : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. ఈ మధ్య ఎలక్షన్స్​లో విజయం సాధించి డిప్యూట్ సీఎం అవ్వడంతో ఇతర భాష సినీ ప్రేక్షకులకు, రాజకీయ నాయకులకు కూడా పరిచయమయ్యారు. తాజాగా ఆయనపై బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ ప్రశంసలు కురిపించారు. ఆయనే మరెవరో కాదు మీర్జాపూర్‌ ఫేమ్ పంకజ్‌ త్రిపాఠి.

పంకజ్ త్రిపాఠి తాజాగా పవన్ కల్యాణ్​పై ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో పవన్‌ను ఉద్దేశించి పంకజ్‌ మాట్లాడుతూ పవన్‌ గొప్ప నటుడని ప్రశంసించారు. పవన్ పుస్తకాలు బాగా చదువుతారని, ఎంతో దూరదృష్టి ఉన్న వ్యక్తి అని కితాబిచ్చారు. ఈ విషయాన్ని తనకు కొందరు దర్శకులు కూడా చెప్పారని అన్నారు. పవన్​కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారని పంకజ్​ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరోవైపు పవన్​ కల్యాణ్​ సినిమాకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. సుజీత్‌ దర్శకత్వంలో పవన్ హీరోగా నటిస్తున్న మూవీ ఓజీ. ఈ సినిమాలో తమిళ స్టార్​ హీరో శింబు పాట పాడిన సంగతి తెలిసిందే. పవన్‌ కెరీర్‌లోనే ఈ పాట బిగ్గెస్ట్‌ ఎలివేషన్‌ సాంగ్‌ అని అంటున్నారు. ఇకపోతే పవన్‌ కల్యాణ్‌ కూడా ఓ సాంగ్ పాడనున్నారని తెలిసింది. అయితే అది హరిహర వీరమల్లులో. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. దీని కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan Upcoming Movies : ప్రస్తుతం పవన్‌ సినిమాల విషయానికొస్తే ఆయన చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. అలానే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వంటి సినిమాలు షూటింగ్‌ను పవన్ చేయాల్సి ఉంది. ఇక రాజకీయాల విషయానికొస్తే పవన్ ప్రస్తుతం తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి విషయంపై పోరాటం చేస్తున్నారు. దీనిపై కొందరు ఆయన్ను విమర్శిస్తుంటే, మరికొందరు మద్దతుగా నిలిచారు.

'మేం వచ్చేస్తున్నాం, మా నాన్నను ఆపడం కుదరదు'- ఐశ్వర్య ఫ్యామిలీకి అభిషేక్ షాకింగ్ సర్​ప్రైజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.