ETV Bharat / entertainment

'ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి' ఉత్తరాంధ్ర స్లాంగ్​లో అభిమానిని ఆటపట్టించిన చిరు!

ఉత్తరాంధ్ర స్లాంగ్​లో మాట్లాడిన చిరు- వీడియో వైరల్

Chiru Vizag Slang
Chiru Vizag Slang (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 7:45 AM IST

Zebra Movie Pre Release : విలక్షణ నటుడు సత్యదేవ్ లీడ్ రోల్​లో తెరకెక్కిన సినిమా 'జీబ్రా'. డైరెక్టర్ ఈశ్వర్‌ కార్తీక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్‌ పిషినాటో హీరోయిన్లుగా కనిపించనున్నారు. నవంబర్ 22న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్​లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్​లో చిరు వైజాగ్ స్లాంగ్​లో మాట్లాడి ఆకట్టుకున్నారు.

'జీబ్రా' సినిమా గురించి చిరంజీవి స్టేజ్​పై మాట్లాడుతుండగా, అభిమానుల్లో ఒకరు 'బాస్ మీ కోసం వైజాగ్ నుంచి వచ్చాను' అని అన్నారు. దానికి చిరు వైజాగ్ స్లాంగ్​లోనే ఫన్నీగా రెస్పాన్స్ ఇచ్చారు. 'అయితే ఏటంటావ్ ఇప్పుడు. నువ్వు వైజాగ్ నుంచి వచ్చావ్. సంతోషమే. మరి ఈ బొమ్మను (జీబ్రా సినిమాను ఉద్దేశించి) నువ్వు వైజాగ్​లో ఆడించాలి ఆ. మన హీరోది కూడా అదే ఊరు. కూర్చోరా కాసేపు, భలేవోడివే!' అంటూ చిరూ ఈవెంట్​లో నవ్వులు పూయించారు. ఆయన వైజాగ్ స్లాంగ్​లో మాట్లాడడంతో ఫ్యాన్స్​ ఈలలతో గోల చేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 'బాసు టైమింగ్ సూపర్', 'చిరు ఆల్​రౌండర్' అంటూ ఫ్యాన్స్ కామెంట్లలో ప్రశంసిస్తున్నారు.

చిరుకు అంకితం
ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవికి అంకితమిస్తున్నట్లు హీరో సత్యదేవ్ చెప్పారు. 'చిరంజీవి మా ట్రైలర్‌ వేడుకకు రావడంతోనే ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ఈ సినిమా నా కెరీర్‌లోనే చాలా పెద్దది. దీన్ని నా తొలి సినిమాలా భావిస్తున్నా. ఈ చిత్రాన్ని చిరంజీవికి అంకితమిస్తున్నా. ఇక నుంచి కచ్చితంగా కొత్త సత్యదేవ్‌ను చూస్తారు. ప్రేక్షకులకు మంచి సినిమాలందిస్తా' అని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రశాంత్‌ వర్మ, వెంకటేశ్‌ మహా, బాల సుందరం, వై.రవిశంకర్, దినేశ్, జెన్నీఫర్, అనిల్‌ క్రిష్, సత్య పొన్నార్, పూర్ణాచారి, అమృత తదితరులు పాల్గొన్నారు.

కన్నడ స్టార్ నటుడు డాలీ ధనంజయ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక సత్యరాజ్, సునీల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్‌.ఎన్‌. రెడ్డి, ఎస్‌.పద్మజ, బాల సుందరం, దినేశ్‌ సుందరం సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.