ETV Bharat / entertainment

చిరు గ్యారేజ్​లో లగ్జరీ కార్లు- ఆ వెహికిల్​కు స్పెషల్ రిజిస్ట్రేషన్! - Chiranjeevi Car Collection - CHIRANJEEVI CAR COLLECTION

Chiranjeevi Car Collection: మెగాస్టార్ చిరంజీవి గురువారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన వద్ద ఉన్న కార్ల కలెక్షన్ గురించి తెలుసుకుందామా మరి.

Chiranjeevi Car Collection
Chiranjeevi Car Collection (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 9:22 AM IST

Chiranjeevi Car Collection: మెగాస్టార్ చిరంజీవి అంటే భారత సినీ పరిశ్రమలో తెలియనివారుండరు. ఎందుకంటే ఆయన అంతలా తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్వయం కృషితో టాలీవుడ్ దిగ్గజ నటుడిగా ఎదిగి అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్​గా ఎదిగారు. ఎత్తుపల్లాలు, ఎన్నో అవమానాలను పడి ఎదిగిన చిరంజీవికి పర్సనల్​గా కార్లంటే చాలా ఇష్టమట. క్రమంలో ఆగస్టు 22(గురువారం) చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన వద్ద ఉన్న కార్ల కలెక్షన్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చిరు గ్యారేజ్​లో లగ్జరీ కార్లు
మెగాస్టార్ చిరు తన కార్స్ విషయంలో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేట్​ కార్స్​ను కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం చిరు గ్యారేజీ అత్యంత ఖరీదైన కార్లుతో నిండిపోయింది. చిరంజీవి దగ్గర రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ కారు ఉంది. దీని ధర రూ.10-11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా చిరంజీవి గ్యారేజ్​లో రెండు టొయోటా ల్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయి. ఈ కార్లు ఎంతో లగ్జరీగా ఉంటాయి. ఈ రెండు కార్లు ధర కలిపి రూ.2 కోట్లపైనే ఉండొచ్చని తెలుస్తోంది.

అలాగే రేంజ్ రోవర్ వోగ్ కూడా చిరు గ్యారేజ్ లో ఉంది. దీని ధర సుమారుగా రూ. కోటి ఉంటుందట. అలాగే రూ.2.75 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును కూడా చిరు కొనుగోలు చేశారు. రీసెంట్ గానే టయోటా వెల్ ఫైర్ కారు కొనుగోలు చేశారు చిరు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. అలాగే ఈ కారు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబరు కోసం చిరు రూ.5 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే చిరు వద్ద ఓ ప్రైవేట్ విమానం కూడా ఉంది.

విశ్వంభర నుంచి స్పెషల్ పోస్టర్
కాగా, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర'లో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ మూవీలో త్రిష హీరోయిన్​గా అవకాశం దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా విశ్వంభర నుంచి ఓ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మెగాస్టార్ మంచి లుక్​లో కనిపిస్తున్నారు. త్రిశూలం లాంటి ఆయుధం చేతబట్టి గుహలోకి చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ను చూసిన అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్, హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆ అవమానం ఎదుర్కొని నెం.1 హీరోగా ఎదిగి: చిరంజీవి జర్నీ ఇది! - Chiranjeevi Birthday

చిరు సినిమాల్లో బాలయ్య ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా? - Balakrishna Favourite Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.