Manoj Bajpayee Suicide Thoughts : హీరో రాజ్‌బబ్బర్‌ను చూసి కథానాయకుడిగా మారాలనే ఆశతో పక్కా పల్లెటూరు నుంచి ఇల్లు వదిలి వచ్చేశారు ఆయన. సినిమా అవకాశాల కోసం తెగ తిరిగారు. అలా ముంబయి, దిల్లీ నగరాల్లో సినిమా ఛాన్స్‌ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయనే విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పేయి.
ఈయన పేరు వినగానే తెలుగులో ప్రేమ కథ, హ్యాపీ, కొమరం పులి, వేదం వంటి చిత్రాలే గుర్తుకు వస్తాయి. 1994 బాండిట్ క్వీన్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఆయన హిందీలో సత్య, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ వంటి చిత్రాల్లోనూ నటించి విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తన నటనకుగానూ పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలతో పాటు రెండు సార్లు జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలా బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నారు.
అయితే కెరీర్లో ప్రారంభంలో ఇంటి నుంచి వచ్చేశాకా చాలా కాలం పాటు నరకం చూసినట్లు ఓ సారి చెప్పారు మనోజ్. డిప్రెషన్లోకి వెళ్లినట్లు కూడా గుర్తుచేసుకున్నారు. "నేను డిప్రెషన్ వల్ల ఎంతటి బాధను అనుభవించానో నా అత్యంత దగ్గరగా, పక్కన ఉన్న వారికి కూడా తెలీదు. ఆ సమయంలో నాకున్న అన్నీ దారులు మూసుకుపోయాయి అనిపించింది. అప్పట్లో గదిలో ముగ్గురు ఉండేవాళ్లం. ఆ తర్వాత ఓ చిన్ని ఇంట్లో దాదాపు 10 మంది ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. నాతోపాటు దర్శకుడు తిగుమాన్షు ధులియా, ధూమ్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య కూడా ఉన్నారు. మా జీవితం చాలా కష్టంగా గడిచింది. ఎన్నో ఆఫర్లు వచ్చి చేజారాయి. మూడు సార్లు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు దరఖాస్తు చేస్తే రిజెక్ట్ అయ్యాను. దీంతో డ్రిపెషన్లోకి కూడా వెళ్లాను. ఒక దశలో సూసైట్ కూడా చేసుకోవాలని భావించాను." అని ఓ సందర్భంలో మనోజ్ చెప్పుకొచ్చారు.
ఇకపోతే మనోజ్ బాయ్‌పేయ్ ప్రస్తుతం ఎంతటి పేరు సంపాదించారో తెలిసిందే. ఓటీటీలో అయితే స్టార్ నటుడిగా ఎదిగారనే చెప్పాలి. ది ఫ్యామిలీ మెన్ సిరీస్‌లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రీసెంట్గా వచ్చిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై, కిల్లర్ సూప్, గుల్ మొహర్ సీరీస్‌లు మనోజ్ బాజ్‌పేయ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జక్కన్న సినిమాలో 8 లుక్స్ - ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన మహేశ్!
'షూటింగ్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తా' - బాలయ్య NBK109 భామ