Malayalam Block buster Nayattu Telugu version OTT : మలయాళ సినిమాలకు మొదటి నుంచి తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య మరింత పెరిగిపోయింది. థియేటర్లతో పాటు ఓటీటీలో అంతా మాలీవుడ్ మూవీస్‌దే హవా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఆడియెన్స్‌ను అలరించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఆ చిత్రమే నాయట్టు. జోజూ జార్జ్, కుంచకో బోబన్, నిమేషా సజయన్ కీలక పాత్రల్లో నటించారు. మార్టిన్ తెరకెక్కించారు. 2021లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోనూ టాప్ ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అయింది. కానీ తెలుగు వెర్షన్ మాత్రం అందుబాటులో లేక ఇక్కడి ప్రేక్షకులు కాస్త నిరాశచెందారు. ఇప్పుడు తెలుగు వారిని అలరించేందుకు చుండూరు పోలీస్‌స్టేషన్(Chunduru Police Station) పేరుతో వచ్చేందుకు రెడీ అయిపోయింది. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో కోటబొమ్మాళి పీఎస్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా సినిమా బానే ఆడింది.
ఇంతకీ కథేంటంటే? - కేరళలో ఎన్నికల సమయంలో ప్రవీణ్ మైఖేల్ (బోబన్) పోలీసు స్టేషన్‌లో విధుల్లో చేరతాడు. ఏఎస్‌ఐగా మణియన్ (జోజు జార్జ్), కానిస్టేబుల్ సునీత కూడా అక్కడే పని చేస్తుంటారు. అయితే ఓ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడితో ప్రవీణ్, మణియన్‌లు గొడవకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఓ రోజు ఫంక్షన్‌కు ఈ ముగ్గురు వెళ్లొస్తుండగా వారి వాహనానికి యాక్సిడెంట్ అవుతుంది. ఈ ప్రమాదంలో అవతలి వైపు వ్యక్తి చనిపోతాడు. వీళ్ల వావానాన్ని నడిపిన డ్రైవర్ పరారవుతాడు. అయితే అవతలి వైపు చనిపోయిన వ్యక్తి అంతకుముందు గొడవకు దిగిన సామాజిక వర్గానికి చెందిన వాడు. దీంతో ఆ వర్గం అంతా కలిసి ఆందోళన చేయడం, అది కాస్త రాజకీయ రంగు పులుముకోవడం జరుగుతుంది. దీంతో ఏ సంబంధమూ లేని ఈ ముగ్గురిని కేసులో ఇరికించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతాయి. దీంతో ఈ ముగ్గురు పోలీసు స్టేషన్ నుంచి పారిపోయి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. సొంత డిపార్ట్‌మెంట్ వారే వీరిని వెంటాడం మొదలుపెడతారు. మరి చివరికి ఆ కేసులోంచి వీరు బయటపడ్డారా? వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్నదే మిగతా కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఫరియా అబ్దుల్లా టాటు వెనక అంత కథ ఉందా? - అసలు మ్యాటర్ ఇదే! - Faria Abdullah Tattoo