ETV Bharat / entertainment

మహేశ్​ వాయిస్​ ఓవర్​తో 'ముఫాసా' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది! - ఫ్యాన్స్ ఫిదా - Mufasa Telugu Trailer - MUFASA TELUGU TRAILER

Mahesh Babu Voice Over Mufasa Trailer : సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించిన 'ముఫాసా ది లయన్‌ కింగ్‌' తెలుగు ట్రైలర్‌ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Mahesh Babu Voice Over Mufasa Trailer (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 11:56 AM IST

Mahesh Babu Voice Over Mufasa Trailer : హాలీవుడ్‌ సినిమాలకు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులను అవి విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. మరి ఆ చిత్రాలలోని పాత్రలకు మన తెలుగు స్టార్స్​ డబ్బింగ్‌ చెబితే ఎలా ఉంటుంది? ఫ్యాన్స్​కు పండగే. ఇక ఆ చిత్రం కూడా తెలుగులో మరో స్థాయికి వెళ్లిపోతుంది.

అయితే ఇప్పుడు ఓ హాలీవుడ్​ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగులో తన గాత్రాన్ని అందించారు. ‘అదే ముఫాసా : ది లయన్‌ కింగ్‌. రీసెంట్​గా ఈ విషయాన్ని మూవీ టీమ్​ కూడా అధికారికంగా ప్రకటించింది. సినిమాలోని కీలక పాత్ర ముఫాసాకు మహేశ్‌ బాబు తన వాయిస్ ఓవర్​ను అందించారు.

తాజాగా దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. "అప్పుడప్పుడు ఈ చల్లని గాలి. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే అవి మాయమవుతున్నాయి" అంటూ మహేశ్‌ బాబా చెప్పే వాయిస్ ఓవర్​ మూవీ లవర్స్​ను ఆకట్టుకుంటున్నాయి. అలానే అద్భుతమైన విజువల్స్‌తోనూ ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది.

సినిమాలో కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌, ఆరోన్‌ స్టోన్‌ సహా తదితరులు నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

మహేశ్ ఆనందం - ముఫాసాకు వాయిస్‌ ఓవర్‌ అందించడంపై మహేశ్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు. " తెలుగులో ముఫాసాకు వాయిస్‌ ఓవర్​ అందించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్లాసిక్‌కు నేను వీరాభిమానిని. అందుకే ఇది నాకెంతో ప్రత్యేకం." అని అన్నారు.

ఇక ఈ మూవీ హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్‌ ఖాన్‌, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన తనయుడు అబ్రం, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ గాత్రం అందించారు. "ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది" అని చెప్పుకొచ్చారు.

'నన్ను ఎంతగానో వేధించారు' : స్టార్‌ హీరోపై నటి ఆరోపణలు! - Hema Committee Report

ఈ వారమే సరిపోదా శనివారం, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్​ - OTT/థియేటర్​లో రాబోయే చిత్రాలివే! - This Week OTT Theatre Releases

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.