Mahesh Babu Namrata Wedding Anniversary : సూపర్‌స్టార్ మహేశ్ బాబు- నమ్రత శిరోద్కర్ దంపతులకు టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ అండ్ బెస్ట్ కపుల్‌గా పేరుంది. అయితే ఈ జంట పెళ్లి చేసుకుంది వాలంటైన్ వీక్‌లో నాలుగో రోజైన టెడ్డీ డే రోజునే కావడం విశేషం. శనివారం వీరిద్దరూ తమ 19 ఏళ్ల వివాహ బంధం నుంచి 20వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో నమ్రత అంతకుముందు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్యూట్ కపుల్ పెళ్లికి సంబంధించిన ఆ ఆసక్తికరమైన అంశాలు ఏంటో తెలుసుకుందాం.
నమ్రతకు మహేశ్ కండీషన్
మహేశ్-నమ్రతలది ప్రేమ పెళ్లి (Mahesh Babu Namrata Love Story) అన్న విషయం అందరికి తెలిసిందే. 2000 సంవత్సరంలో బీ.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన 'వంశీ' సినిమాలో వీరిద్దరు నటించారు. అలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం 5ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు.
పెళ్లికి ముందు నమ్రత కూడా హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. దీంతో పెళ్లి కన్నా ముందే ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి హౌస్‌వైఫ్‌గా ఉండాలని నమ్రతను కోరారట మహేశ్. దీనికి అంగీకరించిన నమ్రత, పెళ్లిపీటలు ఎక్కేకన్నా ముందే అప్పటికే పెండింగ్‌లో ఉన్న సినిమాలను చకచకా పూర్తి చేసి మహేశ్‌తో మెడలో మూడు ముళ్లు వేయించుకున్నారు.
'ఆయనకు రావాల్సిన భార్య విషయంలో మహేశ్ చాలా క్లారిటీతో ఉండేవారు. ఉద్యోగం చేయని అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకున్నారు. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న నన్ను సినిమాలు మానేయాలని అడిగారు. అలాగని నేను ఏదైనా ఆఫీస్‌లో పనిచేసినా సరే దానిని మానేసి ఇంట్లో చక్కగా పిల్లలను చూసుకొమని చెప్పారు. అలా పెళ్లి విషయంలో తన అభిప్రాయాన్ని పెళ్లికి ముందే తెలిపారు మహేశ్. ఇలా కొన్ని విషయాల్లో మేము ఒకరికొకరము త్యాగం చేసుకున్నాం' అని నమ్రత చెప్పుకొచ్చారు.
మహేశ్‌కు నమ్రత కండీషన్
ముంబయికి చెందిన నమ్రతకు హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉండే పెద్ద బంగ్లాల్లో ఉండే అలవాటు లేదట. దీంతో పెళ్లి తర్వాత తనతో హైదరాబాద్‌కు రావాలంటే ముందుగా తాను కాస్త అడ్జెస్ట్ అయ్యేంత వరకు ఓ అపార్ట్మెంట్లో ఉంచాలని మహేశ్‌ను కోరారట నమ్రత. దీనికి మహేశ్ కూడా ఓకే చెప్పారట. అలా పెళ్లైన కొత్తలో ఓ అపార్ట్మెంట్లో ఉన్నారట మహేశ్ దంపతులు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు.
మహేశ్ పెళ్లికి 'నాన్న షరతు'
అయితే వీరి పెళ్లి అందరి ప్రేమ వివాహాల్లాగా అంత ఈజీగా జరగలేదు. ఇందుకు మహేశ్ బాబు తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ ఓ షరతు విధించారట. ముందుగా వీరి ప్రేమ గురించి తెలుసుకున్న ఆయన, మహేశ్-నమ్రతల పెళ్లికి నో చెప్పారట. అయితే అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మహేశ్ సోదరి ఘట్టమనేని మంజుల. తమ్ముడి పెళ్లికి ఒప్పుకోవాలని తండ్రి కృష్ణను ఎలాగోలా ఒప్పించారట. కానీ, ఇందుకు కృష్ణ ఒక కండీషన్ పెట్టారట. పెళ్లికి ముందు ఇద్దరూ స్టార్ స్టేటస్‌ను సంపాదించాలని కోరారట. ఆ తర్వాత ఏమైందో కానీ, తాను పెట్టిన షరతును వెనక్కి తీసుకొని హ్యాపీగా ఇద్దరికి పెళ్లి జరిపించి ఆశీర్వదించారు కృష్ణ. ఇక ఈ జంట ప్రేమ పెళ్లికి గుర్తుగా కుమారుడు గౌతమ్, కుమార్తె సితార జన్మించారు.
'నా దృష్టిలో పెళ్లంటే' - క్లారిటీ ఇచ్చిన ఊర్వశీ
హాలీవుడ్ రేంజ్లో 'కల్కి BGM'- ఇప్పుడిదే ట్రెండింగ్- మీరు విన్నారా?