Mad Square Movie : 2023లో విడుదలైన 'మ్యాడ్' సినిమా కూడా ఇదే కోవకు చెందిందే. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ మీద మేకర్స్ ఫోకస్ పెట్టారు. అప్పట్లోనే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందంటూ అనౌన్స్ కూడా చేశారు.
తాజాగా ఆ అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ అఫీషియల్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'మ్యాడ్ స్క్వేర్' గురించి అనౌన్స్ చేసింది. ఉగాది రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డ ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక నార్నే నితిన్ నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'మ్యాడ్'. ఇందులో నితిన్‌తో పాటు సంతోష్ శోభన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. హీరోతో పాటు ఇందులోని నటీనటులందరూ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌తో మరింత ఎంటర్టైన్ చేసేందుకు ముందుకు రానున్నారు.
-
#MADSquare BEGINS!! 🕺💥
— Sithara Entertainments (@SitharaEnts) April 19, 2024
It's time to take the FUN to new heights, Here are some clicks from the pooja ceremony which was held on UGADI. ✨🤩
Thank you Starboy #Siddu & @anudeepfilm garu for gracing the ceremony. ❤️@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya… pic.twitter.com/uW4hYRDLFP
మ్యాడ్ స్టోరీ ఏంటంటే ?
మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకుంటుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన ఓ బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి మంచి స్నేహితులవుతారు. మనోజ్ శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అశోక్ ఇష్టపడుతుంటుంది. దామోదర్ అలియాస్ డీడీకి గుర్తుతెలియని వెన్నెల అనే అమ్మాయి లవ్ లెటర్ రాసి తనను ప్రేమలో పడేలా చేస్తుంది. హాస్టల్‌కు ఫోన్ చేసి రోజూ డీడీతో ప్రేమగా మాట్లాడుతుంటుంది. వెన్నెలను చూడకుండానే డీడీ నాలుగేళ్లు గడిపేస్తాడు. చివరకు వెన్నెలను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మధ్యలో లడ్డు(విష్ణు) కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఓటీటీల్లో బెస్ట్ కామెడీ మూవీస్- చూస్తున్నంతసేపు నవ్వులే నవ్వులు! - Top Comedy Movies In Tollywood
Mad Movie Heroine : ప్రేక్షకులు మెచ్చిన తెలుగు అందం.. 'మ్యాడ్' సినిమాతో అదరగొట్టిన లోకల్ భామ!