Kubera Movie Teaser : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పాన్ఇండియా లెవెల్లో తెరెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా 'కుబేర'. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతోపాటు హీరో ధనుశ్ నటిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. శేఖర్ తొలి పాన్ఇండియా మూవీ కావడం, తమిళ, తెలుగు స్టార్స్ కలిసి నటిస్తుండడం వల్ల సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే సినిమా నుంచి స్టార్లు నాగార్జున, ధనుశ్, రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. అలాగే నేషనల్ క్రష్ క్యారెక్టర్ గ్లింప్స్ కూడా విడుదలైంది. రీసెంట్గా మరో కొత్త పోస్టర్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అదే సమయంలో టీజర్ రిలీజ్ డేట్ కూడా చెప్పారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తేదీన టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ విషయాన్ని గుర్తుచేస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. కొత్త పోస్టర్లో హీరోయిన్ రష్మిక క్యూట్‌గా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్లో ఓ బ్రిడ్జ్ ఉంది. దీంతో సినిమాలో ఆమె చాలా సింపుల్‌గా కనిపించనున్నట్లు పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. ఎంతో అందంగా కనిపిస్తున్న రష్మిక ఉన్న న్యూ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఆకట్టుకుంటోంది.
Kubera is comingggg! 🥰#SekharKammulasKubera ❤️🔥#KuberaGlimpse in 𝟓 𝐃ays ⏳@dhanushkraja KING @iamnagarjuna @sekharkammula @jimSarbh @ThisIsDSP @AsianSuniel @KuberaTheMovie #Kubera #KuberaGlimpseOnNov15th pic.twitter.com/tmLDS4puC6
— Rashmika Mandanna (@iamRashmika) November 10, 2024
ఇక హీరోయిన్ రష్మికకు సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్‌ను కూడా మేకర్స్ ఇటీవల విడుదల చేశారు.అందులో రష్మిక సింపుల్‌గా కనిపించింది. ఓ గునపం చేతిలో పట్టుకుని అడవిలాంటి ప్రదేశానికి వెళ్లి అక్కడ తవ్వడం మొదలెడుతుంది. ఇంతలో ఆ తవ్వకాల్లో తనకు ఓ పెద్ద సూట్‌కేస్ దొరుకుతుంది. ఆమె ఆ పెట్టెను ఓపెన్ చేయగా, దాని నిండా డబ్బులు కనిపిస్తుంది. ఇలా గ్లింప్స్‌ను ఇంట్రెస్టింగ్గా చూపించారు.
కాగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా తమిళం, తెలుగులో ఒకేసారి షూటింగ్ చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
'కుబేర' నాగ్ పోస్టర్ ఔట్- స్టైలిష్ లుక్‌లో కింగ్ అదుర్స్ - Kubera Movie Nagarjuna First Look
సూట్‌కేస్ నిండా డబ్బులు- రష్మిక సో హ్యాపీ! -'కుబేర'లో ఎలా ఉందంటే? - Rashmika Mandanna Kubera