Heroine Kriti Sanon Boyfriend : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మహేశ్ బాబు హీరోగా నటించిన 'వన్- నేనొక్కడినే', నాగ చైతన్య 'దోచెయ్' చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించిన ఈమె చివరగా ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రంలో నటించి మెప్పించింది. తన ఆఫ్ స్క్రీన్ లోనూ అందరితోనూ బాగుంటుంది.
గ్రీస్ లో బర్త్ డే వేడుకలు - అయితే కృతి సనన్ తనకన్నా చిన్నవాడైన కబీర్ అనే కుర్రాడితో డేటింగ్ చేస్తుందంటూ పలుసార్లు రూమర్స్ వినిపించాయి. కొంతకాలం క్రితం వీరిద్దరు కలిసి లండన్‌లో హోలీ కూడా జరుపుకున్నారు. అయితే తాజాగా కృతి సనన్ ఇటీవలే 34 పడిలోకి అడుగుపెట్టింది. బర్త్ డేను గ్రీస్‌లోని ఓ ఐలాండ్‌లో జరుపుకుంది. ఈ వేడుకలో కృతి సనన్ రూమర్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా పాల్గొన్నాడు. అతడితో ఆమె చిల్ అవుతోన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు కృతిసనన్‌కు ప్రియుడు దొరికేశాడని కామెంట్లు పెడుతున్నారు.
ధోనీ, పాండ్య క్లోజ్ ఫ్రైండ్! - కృతిసనన్ రూమర్ బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాకు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య క్లోజ్ ఫ్రైండ్ అని తెలిసింది. వారితో కలిసి కబీర్ పలుసార్లు ఫొటోలు దిగాడు. అలాగే 2023లో రాజస్థాన్‌లోని ఉదయ్ పుర్ ప్యాలెస్‌లో జరిగిన హార్దిక్- నటాషా వివాహానికి కూడా కబీర్ హాజరయ్యాడు. అతడికి క్రికెట్ అంటే చాలా ఇష్టమట. కబీర్ ఎవరు? కృతిసనన్‌తో పరిచయం ఎలా? - కబీర్ బహియా 1999లో జన్మించాడు. 2018లో ఇంగ్లాండ్‌లోని మిల్ ఫీల్డ్ అనే బోర్డింగ్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. కబీర్ తండ్రి కుల్జిందర్ బహియా యూకేలో వ్యాపారవేత్త. అలాగే మిలియనీర్ కూడా. కుల్జిందర్ యూకేలో ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు. ఆయన ఆస్తి దాదాపు రూ. 4,600 కోట్లు అని బయట కథనాల్లో రాసి ఉంది. మొహబ్బత్ మ్యూజిక్ వీడియోలతో తన కెరీర్‌ను ప్రారంభించిన కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ - తన అక్కకు కబీర్‌ను పరిచయం చేసిందట. అలా పరిచయమైన వీరిద్దరు అప్పుడప్పుడు కలిసి కెమెరా కంటికి చిక్కుతున్నారు. అయితే కబీర్, కృతిసనన్ డేటింగ్లో ఉన్నారని వస్తున్న రూమర్స్‌పై ఇంకా అధికారికంగా ఎవరూ స్పందించలేదు. రిచెస్ట్ ప్లేస్‌లో ప్రాపర్టీ కొన్న కృతిసనన్ - ఎన్ని కోట్లో తెలిస్తే షాకే! - kriti sanon Alibaugమాజీ ముఖ్యమంత్రి మనవడితో ప్రముఖ హీరోయిన్ డేటింగ్! - వీడియో వైరల్ - Manushi Chhillar Boyfriend
గ్రాండ్‌గా బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ సెలబ్రేషన్స్ - ఆహ్వాన పత్రిక ఇదే! - NBK 50 years celebrations