Kriti Sanon Relationship : హీరోయిన్ కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నిర్మాతగానూ రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా లండన్‌కు చెందిన కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో డేటింగ్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో రీసెంట్గా బాగా వైరల్‌గా మారింది. దీంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. కానీ ఈ రూమర్స్‌పై ఆమె మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.
అయితే తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో వివరించింది కృతి సనన్. అతడికి ఉండాల్సిన గుణగణాలను వర్ణించింది. అతడు తన వృత్తిని గౌరవించాలని చెప్పుకొచ్చింది. "ఏ విషయమైనా ఆశ పెట్టుకుంటే ఒత్తిడికి గురౌతాం. అందుకే నేను ఆశలు పెట్టుకోను. ఏమైనా, ఏది జరిగినా స్వీకరించడానికి రెడీగా ఉంటాను. నాకు కాబోయే భర్త నిజాయతీగా ఉండాలని భావిస్తాను. నన్ను నవ్వించాలి, నన్ను, నా పనిని బాగా గౌరవించాలి. ముఖ్యంగా నాతో ఎక్కువ సమయం గడపాలి. ఇక అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను బాగా చూసుకోవాలి. అయితే అన్ని విషయాల్లో నాకు సరితూగాలనే కోరికేమీ లేదు" అని చెప్పింది.
Kritisanon Upcoming Movies : ఇక కృతి సినిమాల విషయానికొస్తే ది క్రూ చిత్రంతో రీసెంట్గా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బాక్సాఫీస్ ముందు మంచి కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రానికి రాజేశ్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. ఇంకా దో పత్తీ సినిమా పనుల్లో బిజీగా ఉంది కృతి. బ్లూ బటర్ ఫ్లై ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆమె నిర్మించనున్న తొలి చిత్రమిది. ఇందుకోసం రోజుకు 16 నుంచి 17 గంటలు వరకు ఆమె పని చేస్తున్నట్లు తెలిపింది. స్క్రిప్ట్, పాత్రలు, సంగీతం ఇలా అన్ని విభాగాల్లోనూ తాను భాగమైనట్లు తెలిపింది. నటిగా తనను ఎంతోమంది అభిమానిస్తున్నారని నిర్మాతగానూ తనను బాగా ఆదరించాలని కోరింది.
'హీరోలకు అంత సీన్ లేదు' : హీరోయిన్ కృతిసనన్ షాకింగ్ కామెంట్స్! - Kritisanon Crew Movie
వీకెండ్ స్పెషల్ - సడెన్‌గా OTTలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ - Latest Telugu Horror Film