ETV Bharat / entertainment

రామ్​చరణ్​ హీరోయిన్​ను పట్టేసిన రాకింగ్ స్టార్​ యశ్​! - Toxic Movie Heroine - TOXIC MOVIE HEROINE

Toxic Movie Heroine : టాక్సిక్​ సినిమాలో యశ్​ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్​ నటించనున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat and Getty Images
Ramcharan and Yash (Source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 4:11 PM IST

Toxic Movie Heroine : కేజీయఫ్‌ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత కన్నడ రాకింగ్​ స్టార్ హీరో యశ్​ నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'​. 'ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌' అన్నది ఉపశీర్షిక. యశ్ 19గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఈ మధ్య కాలంలో రోజుకో వార్త బయటకు వస్తూ ఫుల్ ట్రెండింగ్ అవుతోంది.

మొద‌ట ఈ చిత్రంలో యశ్​కు జోడీగా సాయిపల్లవి అని అన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ న‌టి కరీనా కపూర్‌ పేరు తెరపైకి రాగా రీసెంట్​గా హ్యూమా ఖురేషీ పేరు ప్రచారం సాగింది. ఇప్పుడు మరో కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే సినిమాలో యశ్​ సరసన కియారా అద్వాణీ(Kiara Advani Toxic Movie) నటిస్తుందని అంటున్నారు. దాదాపుగా ఈమె కన్ఫామ్ అని చెబుతున్నారు.

Kiara Advani Upcoming Movies : కాగా, ఈ అందాల భామ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ, హిందీలో ధోనీ బయోపిక్, కబీర్ సింగ్(అర్జున్ రెడ్డి రీమేక్) వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్​లోనూ చేస్తోంది. ఇంకా ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 కోసం ఎంపికైంది. పెళ్లి తర్వాత ఇలా వరుసగా బడా ఆఫర్లను అందుకుంటున్న కియారా ఇప్పుడు టాక్సిక్​లోనూ నటించడం నిజమైతే ఆమెకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

ఇక టాక్సిక్ సినిమా విషయానికొస్తే కియారా అద్వాణీతో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్​గా సిస్టర్ రోల్​లో నయనతార నటించనున్నట్లు తెలిసింది. అలాగే ఈ సినిమాను ముందుగా చెప్పినట్టే ఎటువంటి ఆలస్యం చేయకుండా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్​ ప్రొడక్షన్స్​, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై వెంకట్‌ కె.నారాయణ నిర్మిస్తున్నారు. రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా ఈ కథ రాబోతుందంటూ గతంలో మూవీ టీమ్ తెలిపింది. మాస్‌, యాక్షన్‌ అంశాల్ని మేళవించి బలమైన కథగా తయారు చేయడానికి గీతూ ఎంతో కష్టపడ్డారని పేర్కొంది.

యశ్‌ 'టాక్సిక్‌' షూటింగ్ అప్డేట్​ - మూవీ ఎన్ని భాగాలుగా రానుందంటే? - Yash 19 Toxic

1977లో అనౌన్స్​మెంట్​ 2024లో రిలీజ్​కు సిద్ధం - రూ.1000 కోట్ల బడ్జెట్​తో రానున్న సినిమా! - MEGALOPOLIS MOVIE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.