ETV Bharat / entertainment

కేన్స్​లో కియారా - ప్రతిష్టాత్మక ఈవెంట్​లో రెడ్​కార్పెట్​పై సందడి - Cannes Film Festival 2024 - CANNES FILM FESTIVAL 2024

Kiara Advani Cannes : ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అడ్వాణీ పాల్గొననుంది. ఉమెన్ ఇన్ సినిమా గాలా ద్వారా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఆ విశేషాలు మీ కోసం.

Kiara Advani Cannes
Kiara Advani Cannes (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 3:44 PM IST

Kiara Advani Cannes : 2024 ఏడాదికిగానూ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేడు (మార్చి 14న) ప్రారంభం కానుంది. ఫ్రాన్స్‌ వేదికగా ఎంతో గ్రాండ్​గా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా ఇప్పటికే సందడిగా మారింది.

ఇదిలా ఉండగా, ఈ వేడుకకు పలువురు భారతీయ నటీనటులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పాల్గొననుందట. ఉమెన్ ఇన్ సినిమా గాలా ద్వారా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుందట. అయితే ఈ రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్‌లో కియారాతో పాటు, సల్మా అబు దీఫ్, సరోచా చంకిమ్హా, అధ్వా ఫహద్, అసీల్ ఒమ్రాన్, రమతా టౌలే సై లాంటి స్టార్స్ పాల్గొనన్నారట. మే 18న లా ప్లేజ్ డెస్ పామ్స్‌లో ఈ ఫెస్టివల్ జరగనుంది.

కేన్స్ షెడ్యూల్ ఇదే?
మే 14 నుండి 25 మధ్య ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ జరగనుంది. అందులో పలువురు ఇండియన్ సినీ సెలబ్రిటీలు కలిసి 'భారత్ పర్వ్' అనే ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా సహాయపడుతుందో ఇందులో చూపించనున్నారు. సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు, పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఈవెంట్​లో మెరవనున్నారు. అంతే కాకుండా ఈ ఈవెంట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరగడం ఇదే మొదటిసారి.

ఇక కియారా సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె 'గేమ్ ఛేంజర్' షూటింగ్​లో బిజీగా ఉంది. రామ్​ చరణ్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కియారా వార్ 2 సినిమాలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా ముంబయిలో భారీ చిత్రీకరణ జరుపుకుంటోంది.

గతేడాది కియారా నటించిన 'సత్య ప్రేమ్​ కీ కహానీ' బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. అందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్​లో వచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ కూడా సాధించింది.

రామ్​చరణ్ బర్త్ డే స్పెషల్- 'జరగండి' సాంగ్ వచ్చేసిందోచ్​- చెర్రీ, కియారా స్టెప్పులు చూశారా? - Game Changer Jaragandi Song

హోస్ట్​ రిక్వెస్ట్​కు ఇబ్బందిపడ్డ కియారా - డ్రెస్​లో అంత కన్నా ఎక్కువ చేయలేనంటూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.