ETV Bharat / entertainment

'మహానటి' ఇంట్లో పెళ్లి బాజాలు నిజమే!- ఆ రోజే కీర్తి తండ్రి అనౌన్స్ చేస్తారట! - KEERTHY SURESH MARRIAGE

పెళ్లి పీటలెక్కనున్నకీర్తి సురేశ్​ - ఈటీవీ భారత్​ ఎక్స్​క్లూజివ్ ఇంటర్వ్యూలో కీలక అప్​డేట్ ఇచ్చిన హీరోయిన్ తండ్రి

Keerthy Suresh
Keerthy Suresh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 7:53 PM IST

Actress Keerthy Suresh Marriage : కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు సోషల్​ మీడియాలో పలు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తన బాయ్​ఫ్రెండ్ ఆంటోనీతో ఆమె డిసెంబర్ 11న గోవాలో వివాహం చేసుకోనున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై తాజాగా కీర్తి తండ్రి సురేశ్​ మాట్లాడారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన తన కుమార్తె పెళ్లి గురించి కీలక అప్​డేట్ ఇచ్చారు. "నవంబర్ 25న కీర్తి సురేష్ వివాహం గురించి అధికారికంగా ప్రకటించనున్నాం" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వార్త నిజమే అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ
కీర్తి సురేశ్ పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక మార్లు ఈ బ్యూటీ మ్యారేజ్​పై రూమర్స్ వచ్చాయి. బిజినెస్ మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత ఇలా ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే తమ కూతురి పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేశ్ తల్లిదండ్రులు అప్పట్లో ఖండించారు. అలాగే తన ప్రేమ, పెళ్లిపై గతంలోనూ కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి కీర్తి పెళ్లి రూమర్స్ తెరపైకి వచ్చాయి. వాళ్లిద్దరిది 16ఏళ్ల ప్రేమ బంధం అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ జంట డిసెంబరు 11న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని సమాచారం.

ఇక 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 'మహానటి' సినిమాతో ఇండియా వైడ్​గా పాపులరై, నేషనల్ అవార్డ్ దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సరసన ఓ సినిమాలో కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె ముంబయికి మార్చింది. ఇటీవల రఘ తాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేశ్ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

వాయిస్ ఓవర్ ఓకే- మరి రోల్ ఎందుకు రిజెక్ట్?

కీర్తి సురేశ్ లగ్జరీ లైఫ్​ - విలాసవంతమైన ఇళ్లు, కాస్ట్లీ కార్లు - నెట్​వర్త్​ ఎన్ని కోట్లంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.