ETV Bharat / entertainment

దూసుకెళ్తున్న 'భజే వాయు వేగం' కలెక్షన్స్ - ఆ ఒక్కటే కారణం! - Bhaje Vaayu Vegam Movie - BHAJE VAAYU VEGAM MOVIE

Karthikeya Bhaje Vaayu Vegam Movie : టాలీవుడ్ స్టార్ హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ 'భజే వాయు వేగం' ప్రస్తుతం సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది. దీనికి కారణం ఏంటంటే?

Karthikeya Bhaje Vaayu Vegam Movie
Karthikeya Bhaje Vaayu Vegam Movie (ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 11:03 AM IST

Karthikeya Bhaje Vaayu Vegam Movie : యంగ్ హీరో కార్తికేయ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భజే వాయు వేగం'. యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ మూవీ గత శుక్రవారం ( మే 31)న థియేటర్లలో విడుదలైంది. అయితే దీంతో పాటు 'గ్యాంగ్స్ ఆఫ్​ గోదావరి', 'గం గం గణేశా' సినిమాలు రిలీజవ్వడం వల్ల కార్తికేయ మూవీకి గట్టి పోటీ నెలకొంది.

మూడింటికీ భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది. కానీ మిగతా రెండు సినిమాలు మాత్రం ప్రస్తుతం యావరేజ్ టాక్​తోనే నడుస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం 'భజే వాయువేగం' ప్రస్తతుం సక్సెస్ టాక్ అందుకునే దిశగా వెళ్తోంది. మౌత్ టాక్ వల్ల ఈ చిత్రానికి క్రేజ్ ఏర్పడిందని, దీంతో మూవీ లవర్స్ ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ యాక్టింగ్ కూడా బాగుందని, ఈ సమ్మర్ విన్నర్​ ఈ సినిమానే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

స్టోరీ ఏంటంటే?
వరంగల్‌ సమీపంలోని రాజన్నపేటకు చెందిన కుర్రాడు వెంకట్‌ (కార్తికేయ). తల్లిదండ్రులు వ్యవసాయంలో నష్టాలు రావడం వల్ల అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో అనాథైన వెంకట్‌ను తండ్రి స్నేహితుడు లక్ష్మయ్య (తనికెళ్ల భరణి) చేరదీసి, తన కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటు చూసుకుంటుంటాడు. క్రికెటర్‌ అవ్వాలన్న లక్ష్యంతో వెంకట్‌, మంచి ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో రాజు ఊరి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటాడు. కానీ, కొందరు చేసిన కుట్రల వల్ల అనుకున్న లక్ష్యాల్ని ఆ ఇద్దరూ చేరుకోలేకపోతారు. దీంతో వెంకట్‌ క్రికెట్‌ బెట్టింగ్స్​ వేస్తూ, రాజు ఓ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు.

ఓ సారి వాళ్ల తండ్రి అనారోగ్యానికి గురవుతాడు. అయితే ఆయన్ను కాపాడాలంటే ఆపరేషన్‌ చేయాలని, దానికి సుమారు రూ. 20 లక్షలు ఖర్చవుతుందని అంటారు. దీంతో ఆ డబ్బు సంపాదించే క్రమంలో వెంకట్‌, డేవిడ్‌ (రవిశంకర్‌) గ్యాంగ్‌ దగ్గర క్రికెట్‌ బెట్టింగ్‌ వేస్తాడు. ఆ బెట్టింగ్‌లో వెంకట్‌ గెలిచినప్పటికీ తను గెలుచుకున్న డబుల్‌ అమౌంట్‌ రూ. 40లక్షలు ఇచ్చేందుకు డేవిడ్‌ మనుషులు నిరాకరిస్తారు.

పైగా రాత్రి 9గంటల కల్లా రూ.40 లక్షలు ఎదురు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ బెదిరిస్తారు. దీంతో వెంకట్‌ చేసేదేమీ లేక డేవిడ్‌ కొనుక్కున్న కొత్త కారును తన అన్నతో కలిసి కొట్టేస్తాడు. అయితే దాంట్లో డేవిడ్‌కు చెందిన రూ.8 కోట్లతో పాటు, రూ.5000 కోట్ల హవాలా డబ్బుకు సంబంధించిన రూ.2 వేల నోటు కూడా ఉంటుంది. అంతేకాకుండా డేవిడ్‌ అన్న, హైదరాబాద్‌ మేయర్‌ జార్జ్‌ (శరత్‌ లోహితస్వ) కొడుకు శవం కూడా ఉంటుంది. దీంతో ఆ కారును దక్కించుకునేందుకు డేవిడ్‌ తన గ్యాంగ్‌తో వెంకట్‌ వెంటపడతాడు.

ఇదిలా ఉండగా, కనిపించకుండా పోయిన జార్జ్‌ కొడుకు కోసం హైదరాబాద్‌ పోలీసులంతా సిటీని జల్లెడ పడతారు. మరి, ఆ తర్వాత ఏమైంది ? ఓవైపు డేవిడ్‌ గ్యాంగ్‌ నుంచి, మరోవైపు పోలీసుల నుంచి వెంకట్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన తండ్రిని కాపాడుకునేందుకు తనేం చేశాడు? అసలు జార్జ్‌ - డేవిడ్‌ల కథేంటి? తన అన్న కొడుకును డేవిడ్‌ ఎందుకు చంపాడు? ఈ నిజం జార్జ్‌కు తెలిసిందా? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ విజయం నమ్మకాన్ని ఇచ్చింది: కార్తికేయ

మెగాస్టార్ సినిమాలో విలన్​గా ఛాన్స్ వస్తే?.. కార్తికేయ క్రేజీ ఆన్సర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.