kaithi 2 Movie : తమిళ హీరో కార్తి, సీనియర్ హీరో అరవింద్ స్వామి కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సత్యం సుందరం'. మనలోని చాలా ప్రశ్నలకు ఈ చిత్రం సమాధానం ఇస్తుందని కార్తి అన్నారు. మంచి వినోదమున్న భావోద్వేగభరిత కథతో రూపొందిందని చెప్పారు. ఈ చిత్రాన్ని 96 ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. ఈ నెల 28న సినిమా రిలీజ్ కానుంది.
Sathyam Sundaram Movie : కార్తి మాట్లాడుతూ - "96 విజయం తర్వాత ప్రేమ్ కుమార్ నుంచి వస్తున్న చిత్రమిది. ఆయన ఈ స్క్రిప్ట్‌ను చాలా అద్భుతంగా నవలలా రాశారు. దీన్ని చదువుతున్నప్పుడు చాలా చోట్ల ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి కథ ఎలా రాస్తారు అనిపించింది. నాకు కె.విశ్వనాథ్ సినిమాలు అంటే బాగా ఇష్టం. కానీ, ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. ఇప్పుడు ఈ కథ విన్నప్పుడు అలాంటి ఒక మంచి సినిమా ఇది అవుతుందని అనిపించింది. చాలా అరుదైన స్క్రిప్ట్ ఇది. అన్నయ్య సూర్య ఈ కథ విన్నాక 'నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయి' అని అన్నారు.
మన సంస్కృతికి, మూలాలకు సంబంధించిన సినిమా ఇది. ఇలాంటి కథ అరవింద్ స్వామి నిజ జీవితంలో కూడా జరిగిందట. ఇది తెలిసి ఆశ్చర్యపోయాను. దీంట్లో ఆయన పాత్రలో తనని తప్ప మరొకరిని ఊహించలేం. మా పాత్రల మధ్య కెమిస్ట్రీ మనసుల్ని తప్పకుండా హత్తుకుంటుంది. ఈ చిత్రంలో నాది ఓ చిన్న పల్లెటూరిలో చీరల షాప్ నడిపే అమాయకమైన వ్యక్తి పాత్ర. తనకు జీవితంపై ఎలాంటి అంచనాలు ఉండవు. సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. అన్నయ్య సూర్య నా మొదటి సినిమా చూసినప్పుడు హత్తుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా చూసి గర్వంగా హత్తుకున్నారు" అని కార్తి చెప్పుకొచ్చారు.
"ఇక ఊపిరి తర్వాత తెలుగులో మళ్లీ సినిమా చేయలేదు. ప్రస్తుతం కథలు వింటున్నాను. త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమా చేస్తాను. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ జరుపుకుంటోంది. వా వాతియారే కూడా రానుంది. ఖైదీ 2 చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లొచ్చు "అని కార్తి పేర్కొన్నారు.
అప్పట్లో హోటల్ సర్వర్, ఇప్పుడేమో టాప్ విలన్ - SJ సూర్య సక్సెస్ స్టోరీ ఇదే! - SJ Suryah Career