ETV Bharat / entertainment

టాలీవుడ్ హీరోలపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ - SURIYA COMMENTS ON TOLLYWOOD HEROES

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్​చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబుపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కామెంట్స్!​

Suriya Comments on Tollywood Heroes
Suriya Comments on Tollywood Heroes (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 9:12 AM IST

Suriya Comments on Tollywood Heroes : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన కొత్త చిత్రం 'కంగువా' ప్రమోషన్స్​లో బిజీగా ఉంటున్నారు. తన సినిమాను పాన్ ఇండియా ఆడియెన్స్​కు రీచ్ అవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కంగువా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చెబుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌ హీరోలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సూర్య. మెగా పవర్ స్టార్​ రామ్‌ చరణ్‌ తనకు సోదరుడితో సమానమని చెప్పారు. "ఆయనతో నాకు చాలా మెమొరీస్‌ ఉన్నాయి. నా సినిమాలు చూసి ఫోన్‌ చేసి ప్రశంసిస్తారు. వాళ్ల కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుంది." అని అన్నారు.

సూపర్ స్టార్​ మహేశ్‌ బాబు తనకు స్కూల్లో జూనియర్‌ అని, మహేశ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంటుందని, ఎమోషన్స్ బాగా చూపిస్తారని ప్రశంసించారు సూర్య.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు స్పష్టంగా మాట్లాడడం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. "తారక్​ తెలుగు మాట్లాడే విధానం ఆకట్టుకుంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆ విషయం నన్నెంతో ఆకట్టుకుంటుంది." అని చెప్పుకొచ్చారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుష్ప 2 కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. "నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి అల్లు అరవింద్‌ కూడా ఓ కారణం. గజిని సినిమాను ఆయన డిస్ట్రిబ్యూట్‌ చేశారు. అల్లు అర్జున్‌ చాలా కష్టపడతారు. డ్యాన్స్‌ బాగా చేస్తారు. పుష్ప 2 కోసం వేచి చూస్తున్నా." అని పేర్కొన్నారు.

పాన్ ఇండియా రెబల్ స్టార్​ ప్రభాస్‌తో మల్టీస్టారర్‌ చేస్తే, కచ్చితంగా యాక్షన్‌ జానర్‌లోనే చేస్తానని తెలిపారు.

Kanguva Movie Release Date : కాగా, కంగువా సినిమా విషయానికొస్తే శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రెండు భాగాల్లో విడుదల చేయనున్నారు. తొలి భాగం నవంబర్‌ 14న రిలీజ్ కానుంది. పది భాషల్లో రానుంది. త్రీడీలో కూడా విడుదల చేస్తున్నారు. దిశాపటానీ కథానాయిక. బాబీ దేవోల్‌ కీలకపాత్ర పోషించారు.

గయ్యాళి అత్త సూర్యకాంతంనే భయపెట్టిన 'ఆమె'- అప్పట్లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన తెలుసా?

2 నెలల్లో 7యాక్షన్ మూవీస్- లిస్ట్​లో 'పుష్ప', 'కంగువా'- బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.