ETV Bharat / entertainment

'ఎమర్జెన్సీ'కి సెన్సార్ క్లియర్- కానీ ఆ సీన్స్​కు నో పర్మిషన్! - Kangana Ranaut Emergency

Emergency Movie Censor Certificate: స్టార్ నటి కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' సినిమా సెన్సార్ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇక త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

Emergency Movie Censor
Emergency Movie Censor (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 8:34 PM IST

Emergency Movie Censor Certificate: బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' సినిమా సెన్సార్ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. అయితే సెన్సార్ బోర్డు సినిమాలోని పలు సన్నివేశాల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా సీన్స్‌ను తొలగించడమో లేదా వాటి స్థానంలో కొత్తవి యాడ్ చేయాలని మూవీయూనిట్​కు సెన్సార్ బోర్డు సూచించింది.

అందులో బంగ్లాదేశ్‌ శరణార్థులపై పాకిస్థాన్‌ సైనికులు దాడి చేయడం, ఓ చిన్నారి, ముగ్గురు మహిళలను శిరచ్ఛేదం చేయడం వంటి సన్నివేశాలను మార్చాలని చెప్పింది. ఇక భారత మహిళలను కించపరిచేలా నిక్సన్‌ పాత్ర చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, బంగ్లాదేశ్‌ శరణార్థులు, కోర్టు తీర్పుల సమాచారం ఎక్కడిది? 'ఆపరేషన్‌ బ్లూస్టార్‌' ఫుటేజీ అనుమతికి సంబంధించి కొన్ని వివరాలు కోరింది.

అయితే ఈ సినిమాలో తమను తప్పుగా చూపించారని ఓ వర్గం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే సెన్సార్ సర్టిఫికెట్​ ఆలస్యం అయ్యింది. దీనిపై కంగన బాంబే హై కోర్టును సైతం ఆశ్రయించారు. అయినప్పటికీ ఆమెకు బాంబే హై కోర్టులో ఊరట లభించలేదు. 'సర్టిఫికేట్ విషయంలో సెన్సార్ బోర్డును ఆదేశించలేం' అని బాంబే కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ విషయంలో ఈనెల 18లోపు ఓ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెన్సార్ తాజాగా అప్రువల్ ఇచ్చింది.

కాగా, కంగన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 1975నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాలో కంగన ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ నటులు అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. సెప్టెంబర్ 6న మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా పడింది. మేకర్స్ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.

కంగనాకు సెన్సార్ షాక్‌ - 'ఎమర్జెన్సీ' మరోసారి వాయిదా! - Kangana Ranaut Emergency

కంగన 'ఎమర్జెన్సీ' మళ్లీ వాయిదా- అప్పటిదాకా సెన్సార్ హోల్డ్! - Kangana Ranaut Emergency

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.