ETV Bharat / entertainment

రామ్​చరణ్ ఫ్యాన్స్​ను కలవరపెడుతున్న ఆ విషయం! - ఏంటంటే? - Ramcharan Gamechanger - RAMCHARAN GAMECHANGER

Ramcharan Gamechanger : మెగాపవర్ స్టార్​ రామ్​చరణ్​ ఫ్యాన్స్​కు చిన్న టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే?

source ETV Bharat
Ramcharan (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 8:01 PM IST

Updated : Jul 12, 2024, 9:04 PM IST

Ramcharan Gamechanger : మెగా పవర్ స్టార్ రామ్​చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్​ఆర్​ఆర్​తో ఆయన క్రేజ్​ గ్లోబల్ వైడ్​గా ఎదిగింది. దీంతో ఆయన నుంచి రాబోయే సినిమాలపై ఫ్యాన్స్​లో విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన దిగ్గజ దర్శకుడు శంకర్​తో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు. ఓపెనింగ్ సెరమనీని కూడా గ్రాండ్​గా చేశారు. శంకర్​తో సినిమా అనేసరికి ఫ్యాన్స్​లో అంచనాలు పెరిగినప్పటికీ ఎక్కడో ఓ చోట చిన్న సందేహం నెలకొంది. ఎందుకంటే అప్పటివరకు శంకర్ ఫ్లాపుల్లో ఉన్నారు.

అయితే ఇదే సమయంలో శంకర్ ​ కమల్​హాసన్​ భారతీయుడు 2(Indian 2 Movie Review) ప్రాజెక్ట్​ను డీల్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా తాజాగా విడుదలైంది. కానీ మిశ్రమ స్పందనలను అందుకుంది. దీంతో ఒక్కసారిగా రామ్​ చరణ్ ఫ్యాన్స్​కు కాస్త టెన్షన్ పెట్టుకుంది. ఎందుకంటే శంకర్ నుంచి రాబోయే నెక్ట్స్​ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజరే. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అని తెగ ఆలోచిస్తున్నారు. అలానే గేమ్ ఛేంజర్ కోసం అధ్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాలని సంగీత దర్శకుడు తమన్​ను కోరుతున్నారు.

కాగా, గేమ్​ఛేంజర్​ సినిమాను ఇంటెన్స్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు శంకర్. దిల్​రాజు నిర్మాత. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. అంజలి, SJ సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్ర ఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్​ చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తైంది.

Buchibabu Sana Ramcharan RC 16 : ఇకపోతే రామ్​చరణ్​ దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్​సీ 16 సినిమాను చేయనున్నారు. కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌కుమార్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ డ్రామా ఇతివృత్తంగా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

రామ్​చరణ్ ఫ్యాన్స్​ను కలవరపెడుతున్న ఆ విషయం! - ఏంటంటే? - Ramcharan Gamechanger

పవర్‌ లిస్ట్‌ యాక్టర్స్​లో ప్రభాస్​, రామ్​చరణ్​, అల్లు అర్జున్​ - జాబితాలో ఇంకెవరున్నారంటే? - POWER LIST ACTORS

Last Updated : Jul 12, 2024, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.