ETV Bharat / entertainment

టాలీవుడ్ వల్లే నేను స్టార్​ను అయ్యా- ఎన్నో కష్టాలు పడి!: కమల్ - Bharateeyudu 2 Pre Release Event

Bharateeyudu 2 Pre Release Event: లోకనాయకుడు కమల్ హాసన్- శంకర్ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు- 2' జులై 12న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ హైదరాబాద్​లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్​లో హీరో కమల్​ హాసన్​తోపాటు డైరెక్టర్ నటీనటులు పాల్గొన్నారు.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 7:31 AM IST

Updated : Jul 8, 2024, 7:43 AM IST

Bharateeyudu 2
Bharateeyudu 2 (Source: ETV Bharat)

Bharateeyudu 2 Pre Release Event: లోకనాయకుడు కమల్ హాసన్- శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'భారతీయుడు- 2'. 1996లో రిలీజైన బ్లాక్​బస్టర్​ 'భారతీయుడు'కు సీక్వెల్​గా పాన్ఇండియా రేంజ్​లో ఈ సినిమా రూపొందింది. ఈ మూవీ జులై 12న వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్​లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్​లో హీరో కమల్ హాసన్​ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

'తెలుగు చిత్రసీమే నా జీవితంలో నన్ను స్టార్‌ని చేసింది. 'మరో చరిత్ర', 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' విజయాలు నాకు ఇక్కడే దక్కాయి. 1996లో 'భారతీయుడు' రిలీజైనప్పుడు 'ఇంత ఖరీదైన చిత్రం ఆ స్థాయి వసూళ్లు సాధిస్తుందా' అని విమర్శలు వినిపించేవి. కానీ, ఆ సినిమాకు మేము ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. భారీ స్థాయిలో విజయాన్ని అందుకొన్ని ప్రేక్షకులను మెప్పించింది. ఇక 'భారతీయుడు- 2' మన అందరి సినిమా. ఈ జనరేషన్​కు సరిపోయే కథ ఇది. 6ఏళ్లు అనేక కష్టాలు ఎదుర్కొని ఈ సినిమా చేశాం. ఇది రెండు పార్ట్​లుగా రానుంది. 'భారతీయుడు -2' ను ఆదరించిన హిట్ చేయండి. ఆ తర్వాత వీలైనంత త్వరలోనే 'భారతీయుడు -3' తీసుకువస్తాం' అని కమల్​ హాసన్ అన్నారు.

కల నెరవేరింది: ఈ సినిమాలో నటించడం వల్ల తన కల నెరవేరిందని హీరో సిద్ధార్థ్ అన్నాడు. 'కమల్ ​సన్‌తో కలిసి నటించాలి. ఆయనతో వేదిక పంచుకోవాలని ఎప్పట్నుంచో కోరిక ఉండేది. ఇప్పుడు శంకర్ సర్​తో అది నిజమైంది. ఈ సినిమాలోని అంశాలు రేపటి తరానికి ఉపయోగపడతాయి' అని సిద్ధార్థ్ అన్నారు.

అసలు ఊహించలేదు: 'భారతీయుడు- 2'లో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. అలాంటిది ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ శంకర్​కు థాంక్స్. కమల్ సర్​తో కలిసి నటించాలన్న నా కల నెరవేరింది' అని హీరోయిన్ రకుల్​ప్రీత్ సింద్ అన్నారు. కాగా, ఈ సినిమాలో కమస్​హాసన్, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్​ప్రీత్ సింగ్, యస్ జే సూర్య, బ్రహ్మానందం, బాబి సింహా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

నా మాటలను వేరేలా అర్థం చేసుకున్నారు- అసలు ఉద్దేశం అది కాదు: కమల్ - Kamal Haasan Indian 2

కమల్​ హాసన్ - ఆ హాలీవుడ్ స్టార్​ హీరో కోసం మేకప్ ఆర్టిస్ట్‌గా! - Kalki 2898 AD Kamal Haasan

Last Updated : Jul 8, 2024, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.