Disha Patani Sister Khushboo Patani : లోఫర్ సినిమాలో తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన దిశా ఆ తర్వాత ధోనీ సినిమాతో బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసినవి కొన్ని సినిమాలే అయినా క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే దిశాకు ఒక అక్క కూడా ఉంది. అయితే సాధారణంగా తారల తోబుట్టువులు లేదా కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీని ఎంచుకుంటూ ఉంటారు. అయితే దిశా అక్క ఖుష్బూ పటాని మాత్రం దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుని ఆర్మీలో చేరింది. ఆర్మీలో లెఫ్టినెంట్ ఉద్యోగిగా సేవలు అందిస్తోంది.
1991లో జన్మించిన ఖుష్బూ పటాని స్వస్థలం బరేలి, ఉత్తరప్రదేశ్ బరేలిలోనే తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి DITలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టా అందుకుంది. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది ఖుష్బూ. దేశానికి సేవ చేయాలనే తపన తనను కమిషన్డ్ ఆఫీసర్‌గా చేసింది. అందులో తన ర్యాంక్ వలన లెఫ్టినెంట్ హొదా పొందుతోంది.
ఫిట్నెస్ మీద తన చెల్లికి ఉన్నట్లే ఖుష్బూకు చాలా ఆసక్తి ఉంది. యాక్టివ్ లైఫ్ స్టైల్ కోసం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం అని నమ్ముతుంది ఖుష్బూ. మిలిటరీ ట్రైనింగ్ ద్వారా ఫిట్నెస్ మీద మరింత ఆసక్తి పెంచుకుంది. సోషల్ మీడియాలో వర్క్ అవుట్ వీడియోస్‌ను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను యాక్టివ్‌గా ఉండమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌తో తన లైఫ్ అప్డేట్స్ పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఆర్మీలో ఉద్యోగంతో పాటు తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా గడపుతూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఖుష్బూ. దేశభక్తి, పట్టుదలతో పాటు అభిరుచికి తగ్గ వృత్తిని ఎంచుకోవడమే కాదు ఆరోగ్యం మీద తనకు ఉన్న అవగాహనతో తన ఫాలోవర్స్‌కు ఫిట్‌గా ఎలా ఉండాలో చెబుతూ స్పూర్తిని అందిస్తుంది. ఇకపోతే దిశా పటాని విషయానికొస్తే చాలా కాలం తర్వాత త్వరలోనే మళ్లీ టాలీవుడ్ తెరపై కల్కి సినిమాతో సందడి చేయనుంది.
'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారేంటి? - Kalki 2898 Ad kamal Haasan