ETV Bharat / entertainment

ఫెస్టివల్ అప్డేట్స్ సెంటిమెంట్- ఈ సినిమాల నుంచి ప్రభాస్ న్యూ లుక్ పక్కా!​ - hanuman movie ott

Kalki Movie Update: టాలీవుడ్​లో ఏదైన పండగ వస్తుందంటే మేకర్స్​ కొత్త సినిమాల అప్డేట్స్ వదులుతుంటారు. అయితే ప్రభాస్ కల్కి సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్​ నుంచి అప్డేట్స్ ఉండవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Kalki Movie Update
Kalki Movie Update
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 9:22 AM IST

Updated : Mar 7, 2024, 12:43 PM IST

Kalki Movie Update: రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో 'కల్కి 2898 AD' తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాను 2024 మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా కోసం ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఏదైన పండగ వచ్చిందంటే టాలీవుడ్​లో మేకర్స్​ మూవీ అప్డేట్స్ ఇస్తుంటారు. కాగా, 'కల్కి' రిలీజ్​కు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో శుక్రవారం (మహా శివరాత్రి) కల్కి నుంచి ఏదైనా అప్డేట్ ఉండవచ్చని డార్లింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే మూవీటీమ్ ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో రేపు అప్డేట్స్ వచ్చే ఛాన్స్​లు తక్కువగానే ఉన్నాయి.

ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' నుంచి శివరాత్రి సందర్భంగా ఓ అప్డేట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. అయితే ఈ సినిమాలో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నారు. దీంతో శివరాత్రి రోజు ప్రభాస్ ఫస్ట్​ లుక్​ రిలీజ్ చేయవచ్చని ఇన్​సైట్ టాక్. ఒకవేళ అదే నిజమైతే 'కల్కి' నుంచి అప్డేట్ రాకున్నా 'కన్నప్ప' శివుడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్ లుక్​ రిలీజైనా డార్లింగ్ ఫ్యాన్స్​ పండగ చేసుకుంటారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ- విశిష్ఠ కాంబోలో రానున్న 'విశ్వంభర'లోనూ కాస్త డివోషనల్ టచ్ ఉండేలా కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా పోస్టర్, రిలీజ్ డేట్ తప్ప మరో అప్డేట్ లేదు.

ఇక ఓటిటి విషయానికొస్తే, బ్లాక్​బస్టర్ మూవీ 'హను-మాన్' శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్​ను ప్రముఖ ఓటిటి ప్లాట్​ఫామ్ జీ5 సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాతోపాటు నందమూరి చైతన్య కృష్ణ- సెంజలియా జంటగా నటించిన 'బ్రీత్' మూవీ, బిగ్​బాస్ ఫేమ్ వీజే సన్నీ 'సౌండ్ పార్టీ' సినిమాలు కూడా శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి.

'కల్కి'లో టాలీవుడ్ స్టార్ నటుడు ఫిక్స్​- పాన్​వరల్డ్​ మూవీకి మరింత హైప్​

హాలీవుడ్​ రేంజ్​లో 'కల్కి BGM'- ఇప్పుడిదే ట్రెండింగ్​- మీరు విన్నారా?

Last Updated : Mar 7, 2024, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.