ETV Bharat / entertainment

'కల్కి' క్యారెక్టర్స్​లో కన్య్ఫూజన్?​ ప్రభాస్ సహా అందరి పాత్రలకు రిఫరెన్స్​ అదేనా? - Kalki Characters

Kalki Characters List: ప్రభాస్ నటించిన కల్కి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులలో అంచనాలు భారీగా వున్నాయి. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలను ఏ పాత్రిపదికగా తీసుకొని నాగ్‌ అశ్విన్‌ డిజైన్‌ చేసి ఉంటారో ఓసారి చూద్దాం.

Kalki Characters
Kalki Characters (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 4:47 PM IST

Kalki Characters List: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా- స్టార్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). ఈ ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్​ను వైజయంతి మూవీస్ బ్యానర్​పై నిర్మాత అశ్వినీదత్ రూపొందిచారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్​ సినిమా జూన్ 27న గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

రీసెంట్​గా ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్​లు విడుదలయ్యాయి. సినిమా మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ అని రీసెంట్​గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. అయితే ఈ సినిమాలో ఎవరెవరు ఏయే పాత్రల్లో నటించారు. నాగ్‌ అశ్విన్‌ ఆ పాత్రలను ఏయే పౌరాణిక అంశాల ద్వారా డిజైన్‌ చేసుకుని ఉంటారు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం.

శివతత్వమే భైరవుడా?
ప్రభాస్‌ భైరవ అనే పేరుతో బౌంటీ హంటర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇది కూడా పురాణాల నుంచి తీసుకొని డిజైన్‌ చేసిన పాత్ర అనే అనిపిస్తోంది. అసలు భైరవ అంటేనే అందులో శివతత్వం ఉంది. అసలు భైరవుడు ఉద్భవించడానికి ఓ కథ ఉంది. పరమేశ్వరునికి తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన అనే ఐదు ముఖాలు. అటు బ్రహ్మకి కూడా 5 ముఖాలు. ఒకనాడు ఋషులకి త్రిమూర్తులలో ఎవరూ అసలైన బ్రహ్మము అని సందేహం వస్తుంది, తీర్చమని వారినే అడుగుతారు. ఇంకెవరు నేనే బ్రహ్మము అంటాడు శివుడు. కాదు నేనే కదా తలరాతలు రాసేది కాబట్టి నేనే బ్రహ్మము అంటాడు బ్రహ్మ. నువ్వు నా నాభి నుంచి పుట్టావు అలాంటప్పుడు నేనే కదా బ్రహ్మము అని అంటాడు విష్ణువు.

అప్పుడు నిర్ణయం కోసం చతుర్వేదాలని, ప్రణవ నాదాన్ని పిలుస్తారు. అందరూ శివుడే పరబ్రహ్మం అని తేల్చి చెప్తారు. ఈ మాటలకు విష్ణుమూర్తి తన అంగీకారం చెప్తాడు. కానీ, బ్రహ్మ అందుకు ఒప్పుకోడు దాంతో. బ్రహ్మను శిక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది శివుడికి. అతని ఆగ్రహం లోంచి పుట్టిన భైరవుడు, బ్రహ్మ ఐదవ తలని గోటితో తుంచేస్తాడు. బ్రహ్మ అహంకారం దిగిపోతుంది. కానీ దీనివల్ల భైరవుడికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది దాని నుంచి విముక్తుడు కావడం కోసం ఎన్నో ప్రదేశాలు తిరుగుతాడు. 12 సంవత్సరాల పాటు చేతికి అంటుకున్న ఆ కపాలంలోనే తింటాడు. చివరికి కాశీలో అడుగుపెట్టిన క్షణమే అతని పాపం నశిస్తుంది. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్నిభక్తితో పూజించి తరించాడు. వెంటనే ప్రత్యక్షమైన కాశీ విశ్వనాథుడు భైరవుడిని ఆ క్షేత్రానికి పాలకుడిగా చేశాడు.

ఇక సినిమా విషయానికి వస్తే విడుదలైన ట్రైలర్​, యానిమేషన్‌ సిరీస్‌ ప్రకారం భైరవకు కాశీ మొత్తం తెలుసు. కాశీలో ఉండే ప్రతి ఒక్కరికీ భైరవతో పరిచయం ఉన్నట్టు 'భైరవ అండ్‌ బుజ్జి' యానిమేషన్‌ సిరీస్‌లోనూ కనపడుతుంది. అశ్వత్థామలాంటి శక్తిమంతమైన వ్యక్తిని కూడా ఎదుర్కొనే బలమున్న పాత్రగా దాన్ని నాగ్‌ అశ్విన్‌ తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. త్వరలో పుట్టబోయే కల్కిని రక్షించే వ్యక్తిగా ఈ భైరవుడిని చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే అశ్వత్థామ చేతిలో ఉన్నఓ ఆయుధం ఆ తర్వాత భైరవ చేతిలో కూడా ఉన్నట్లు పోస్టర్స్‌లో కనిపిస్తుంది.

అశ్వత్థామ
శ్రీమహా విష్ణువు స్వీకరించిన దశావతారాలలో చివరి అవతారం కల్కి. ఇక 2898 ఏడీలో అంటే కల్కి అవతరించడానికి ముందే ఈ కథ మొదలవుతుంది. అంటే బహుశా భారతంలో అశ్వత్థామ పాత్ర స్పూర్తి తో బాలీవుడ్ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తున్న పాత్రను తయారు చేసుకొని ఉంటారు. భారతంలో అత్యంత శక్తిమంతమైన, ఆవేశం ఉన్న పాత్ర అశ్వత్థామ. పాండవులమీద కోపంతో రగిలిపోయిన అశ్వత్థామ ఉత్తర గర్భాన్ని నాశనం చేస్తాడు.

దీంతో చిరంజీవిగా చిరకాలం జీవించే అమరత్వం ఉన్నప్పటికీ కృష్ణుని శాపం వల్ల శరీరం అంతా మానని గాయాలతో కుష్టు రోగ్యంతో కొన్ని వేల ఏళ్ళు జీవిస్తాడు. నుదుటున మణితో పుట్టిన అశ్వత్థామకు ఆకలి దప్పికలు ఉండవు. మణి ప్రభావంతో ఏ ఆయుధము, దేవతలు, నాగులు కూడా నాశనం చేయలేవు. ఇక ఈ సినిమాలో 'కల్కి' అవతార ఆవిర్భావానికి అశ్వత్థామకు ఏంటి సంబంధం అనేది ఆసక్తిగా చూపించనున్నారు. ఎందుకంటే గర్భిణి అయిన దీపికా పదుకొణెను కాపాడటం కోసం అమితాబ్ ప్రయత్నిస్తున్నాడన్నది ఇప్పటికే ట్రైలర్​లో కనిపించింది.

కమల్ కలి పురుషుడా?
'కల్కి'లో ప్రతినాయకుడు సుప్రీం యాస్కిన్‌ పాత్రను పోషించారు కమల్‌హాసన్‌. ఈ సినిమాలో కమల్ చూడటానికి చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. 'ఎన్ని యుగాలైనా మనిషి మారడు మారలేడు' అనే కమల్‌హాసన్‌ డైలాగ్ బట్టి అతనే కలి అన్న అనుమానం రాక మానదు. మిలియన్‌ యూనిట్స్‌ సంపాదించి కాంప్లెక్స్‌కు వెళ్లి సుఖమయ జీవితం గడపాలన్న ఆశతో ఏ పని అయినా చేయడానికి సిద్ధపడతాడు భైరవ. అంటే తనలో అప్పటికే కలి ఉంది. దానిని గుర్తించి, 'కల్కి' కోసం సుప్రీం యాస్కిన్‌(కమల్ హాసన్ )తో భైరవ పోరాటం చేస్తాడేమో. అప్పుడు భైరవ కాశీకే కాదు కల్కి కి కూడా రక్షకుడిగా మారతాడేమో.

దీపికా పదుకొణె- సమ్‌-80
ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మరో కీలక పాత్ర పోషిస్తోంది. దీపిక గర్భిణిగా కనిపిస్తున్న ఈ పాత్రను 'సమ్‌-80'గా పిలుస్తున్నారు. 'భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందని అంటారు. అలాంటిది మీ కడుపున ఆ భగవంతుడే ఉన్నాడు' అని ట్రైలర్ లో అశ్వత్థామ పాత్ర(అమితాబ్ ) అనే ఒక్క డైలాగ్ బట్టి 'కల్కి' పుట్టిబోయేది ఆమెకే అన్న విషయం అర్థమవుతోంది. కలి యుగం అంతం అయ్యే సమయంలో శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు, సుమతిల కుమారుడిగా 'కల్కి' పుడతాడని పురాణగాథలు చెబుతున్నాయి. ఆ సుమతి పేరును సినిమాకు అనుగుణంగా మార్చి 'సమ్‌-80' పిలుస్తున్నట్లు అనిపిస్తోంది.

ఉత్తరగా మాళవిక?
మహాభారతంలో పాండవుల వంశం నిలిపేవాడు పరీక్షిత్తు. అతను ఉత్తర గర్భంలోనే పుడతాడు. అభిమాన్యుడి భార్య ఉత్తర. ద్రోణుడి కుమారుడు కౌరవులతో చేరి పాండవుల మీద కోపంతో వారి వంశాన్ని నాశనం చేయడానికి ఉత్తర గర్భంపై బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు కృష్ణుడు తన యోగమాయతో ఆ పిండాన్ని బతికించి, చిరంజీవి అయిన అశ్వత్థామను శరీరం అంతా మానని పుండ్లతో కలియుగాంతం వరకూ జీవించమని శపిస్తాడు.

ఈ సినిమాలో రోక్సీ అనే పేరుతో దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు తెరపై ఓ మెరుపు మెరిసిన కథానాయిక శోభన ఈ మూవీతో మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాలో శంబల మహిళ మరియంగా శోభన మెరవనున్నారు. శంబల రెబల్‌ ఆర్మీలో కీలక వ్యక్తులుగా పశుపతి, అనా బెన్‌ కాంప్లెక్స్‌ను నియంత్రించే కమాండర్‌ మానస్‌గా స్వాస్థ్‌ ఛటర్జీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్‌ ఇంటి యజమానిగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సందడి చేయనున్నారు. నట కిరీటీ రాజేంద్రప్రసాద్‌ పాత్ర ఏంటన్న దానిపై ఆసక్తి నెలకొంది. బుజ్జి పాత్రకు కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్ ఇచ్చింది.

ఇవి కాకుండా కల్కిలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని టాలీవుడ్‌ టాక్‌ వినిపిస్తోంది. 'సీతారామం' జోడీ దుల్కర్‌ సల్మాన్‌- మృణాళ్ ఠాకూర్‌, విజయ్ దేవరకొండ, రాజమౌళి అతిథి పాత్రల్లో మెరుస్తారన్న వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ ఎంత నిజమో తెలియాలంటే జూన్‌ 27వ వరకూ వేచి చూడాల్సిందే!

ఆ మూడు ప్రపంచాల మధ్య యుద్ధమే 'కల్కి' - సినిమా కథ చెప్పేసిన నాగ్ అశ్విన్​ - Kalki 2898 AD Story

అమితాబ్ నన్ను అలా చేయొద్దన్నారు : ప్రభాస్​ - Kalki 2898 AD Pre Release Event

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.