Kalki Second Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD నుంచి రెండో ట్రైలర్ రిలీజైంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడం వల్ల మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే మూవీ మేకర్స్ శుక్రవారం ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ విడుదల చేశారు. రీసెంట్గా రిలీజైన తొలి ట్రైలర్‌లా ఈ వీడియో కూడా హై క్వాలిటీ విజువల్స్‌తో ఉంది.
ఈ ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్స్ సీన్స్‌తో నింపేశారు. లోకనాయకుడు కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. 'ఎన్ని యుగాలైనా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనుషులు మారరు, మారలేరు' అనే డైలాగ్ అదిరిపోయింది. ఇక హీరో ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మధ్య కూడా ఫైట్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక హీరోయిన్ దీపికా పదుకొణె, శోభనను కూడా కాసేపు చూపించారు. ఆఖర్లో ప్రభాస్ డైలాగ్ కూడా బాగుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి ట్రైలర్ భారీ యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా ఉంది. ఇక ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 30 నిమిషాలకే 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
అయితే సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి కన్య్ఫూజన్ రాకుండా ఉండేందుకు దర్శకుడు నాగ్అశ్విన్ రీసెంట్గా కథపై ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా మూడు ప్రపంచాలకు సంబంధించింగా ఉంటుందని అన్నారు. వనరులన్నీ నాశనమైపోయిన ప్రదేశం కాశీ (వారణాసి), శరణార్థులు ఉండే ప్రదేశం శంబాలా, అన్ని అందుబాటులో ఉండే స్వర్గం వంటి ప్రదేశం కాంప్లెక్స్. ఈ మూడింటి చుట్టూ తిరిగే కథే కల్కి అని చెప్పారు.
కాగా, ఈ చిత్రంలో హీరో ప్రభాస్ భైరవ్‌గా కనిపించనున్నారు. సినిమా కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన బుజ్జి (కారు)ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ స్పెషల్ కారుకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చెన్నై సహా పెద్ద పెద్ద నగరాల్లో కారును తిప్పుతున్నారు. ఇక దీపికా పదుకొణెతోపాటు మరో స్టార్ హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ హీరో కమల్ హాసన్ గెస్ట్ రోల్లో పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
'కల్కి' అఫీషియల్ టోటల్ రన్ టైమ్ వచ్చేసింది - ఎంత సేపంటే?
అమితాబ్ నన్ను అలా చేయొద్దన్నారు : ప్రభాస్ - Kalki 2898 AD Pre Release Event