Kalki 2898 AD Runtime : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో రూపొందిన 'కల్కి 2898 AD' మూవీ మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోనల్ ఈవెంట్స్‌ను మేకర్స్ భారీ స్థాయిలో చేస్తున్నారు. తాజాగా బుజ్జీ (కారు) కూడా చెన్నై వీధుల్లో సందడి చేసింది. ఇలా కల్కి సినిమా గురించి వరుస అప్డేట్స్ వస్తున్న తరణంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది.
తాజాగా 'కల్కి' మూవీ రన్‌టైమ్ ఫిక్స్ అయ్యిందట. ఎడిటింగ్‌లో కుదించి సుమారు మూడు గంటలకు ఫిక్స్ చేశారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ఇంకాస్త సమయం ఉన్నందున, ఈ రన్ టైమ్‌లో మరిన్ని మార్పులు ఉండొచ్చని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా, తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న ప్రభాస్, నాగ్ అశ్విన్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అసలు ఈ సినిమాకు అంత బడ్జెట్ ఎందుకు అయ్యిందో వివరించారు. ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇద్దరూ ముచ్చటించారు.
"కల్కి మూవీ గ్లోబల్ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసమే కాకుండా అంతర్జాతీయంగా ఉన్న వారికోసం రూపొందించాం. అందుకే ఈ మూవీకి అంత ఎక్కువ బడ్జెట్ అయింది. దేశంలోని గొప్ప నటీనటులను ఈ సినిమా కోసం తీసుకున్నాం. నన్ను అందరూ పాన్ ఇండియా స్టార్ అంటూ పిలుస్తున్నారు. అది నాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. కానీ, నన్ను అలా పిలవడానికి అభిమానులు ఇష్టపడుతుంటారు. వాళ్లకు ఆ పిలుపు ఓ రకమైన సంతోషాన్నిస్తుంది" అంటూ ప్రభాస్ పేర్కొన్నారు. ఇక ఇదే వేదికగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు.
"కల్కి చూసిన తర్వాత ఆడియెన్స్ మరో ప్రపంచంలోకి వెళ్లొచ్చామనే ఫీల్ పొందుతారు. 'అవతార్' చూసినప్పుడు నేనూ అలాంటి అనుభూతే పొందాను. ఆ సినిమా వల్ల నాకు ఓ కొత్త లోకాన్ని చూసినట్లు అనిపించింది. ఇప్పుడు 'కల్కి' చూసినప్పుడు కూడా థియేటర్‌లో ఉన్న వాళ్లకు అలానే అనిపిస్తుంది. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసమే పెట్టాం. అందులో ఎటువంటి మార్పులు చేయం" అంటూ క్లారిటీ ఇచ్చారు.
'కల్కి' ప్రీల్యూడ్స్కు OTT లాక్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే? - Kalki Prelude Videos
'బుజ్జి' తో సెల్ఫీ కావాలా?- 'కల్కి' టీమ్ ప్లాన్ అదుర్స్! - Kalki 2898 AD