Kalki 2898 OTT : నాగ్ అశ్విన్ డైరక్షన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బ్లస్టర్ మూవీ 'కల్కి 2898 AD'. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తూ దూసుకెళ్తోంది. సౌత్, నార్తే కాకుండా ఇంటర్నేషనల్గానూ ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు బారులు తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.415 కోట్లుకుపైగా వసూళ్లు సాధించిందని మూవీ యూనిట్ ప్రకటించింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫార్మ్ అయ్యిందని, తెలుగు, మలయాళ,ల తమిళ, కన్నడ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్, అలాగే హిందీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకున్నట్లు టాక్ వచ్చింది. అంతే కాకుండా జూలై లాస్ట్ వీక్ కల్లా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు అందులో రాసుంది. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‌లో మార్పులు జరిగినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే ముందుగా ఇచ్చిన ఓటీటీ డేట్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఓటీటీ ప్లాట్‌ఫాంలను అడిగారట మేకర్స్. సినిమాను ఇంకొన్ని వారాలపాటు థియేటర్లలోనే నడిపించాలని అందుకే ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా సెప్టెంబరు రెండో వారానికి గానీ ఓటీటీల్లో రిలీజ్ చేయాలనుకోవడం లేదని సమాచారం.
ఇదిలా ఉంటే, జూన్ 27న రిలీజైన ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో వచ్చే ఏడాది నాటికి కల్కి సీక్వెల్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. వరుసగా మూడోరోజు హౌస్‌ఫుల్ షోస్‌తో రన్ అవుతూ, నయా రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో కల్కి మరో రికార్డు కొట్టింది.
ఈ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో కనిపించిన రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి తప్పించి మిగతా వాళ్లంతా స్టోరీలో భాగంగానే ఉన్నారు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్న నాగ్ అశ్విన్ యానిమేషన్‌తో కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించగలిగారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోరును అందించిన సంతోష్ నారాయణన్ మంచి మార్కులు పడ్డాయి. నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
మూడోరోజూ కల్కి జోరు- 24 గంటల్లో 12.8లక్షల టికెట్స్ సోల్డ్! - Kalki 2898 AD